లేపాక్షి: మండల పరిధిలోని సిరివరం గ్రామంలో గురువారం హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ శుద్ధ జల వాటర్ ప్లాంట్ను గురువారం ప్రారంభించారు. సిరి వరం తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజలు తాగునీటి కోసం శుద్ధ జల వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బాలకృష్ణను అభ్యర్థించారు. వారి అభ్యర్థన మేరకు గతంలో ఎమ్మెల్యే బాలకృష్ణ 8 లక్షల రూపాయలు తన సొంత నిధులను మంజూరు చేశారు. గురువారం నందమూరి బాలకృష్ణ సిరి వరం గ్రామానికి విచ్చేశారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ సుద్దజల వాటర్ ప్లాంట్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ పాలనలో విద్య, వైద్య రంగాల్లో విశేష అభివృద్ధి సాధించిందన్నారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అందించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కిందన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సిసి రహదారులు మురుగునీటి కాలువలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అభివృద్ధి శూన్యమన్నారు. చంద్రబాబు పాలన లో జరిగిన రాష్ట్ర అభివృద్ధి ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయలేదన్నారు. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అవి ఆ వాస్తవం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేత అంబికా లక్ష్మీ నారాయణ, మండల టిడిపి కన్వీనర్ జయప్ప, సిరివరం కృష్ణప్ప, ఆనంద్ కుమార్, చంద్రశేఖర్ గౌడ్, బయన్నపల్లి రవి, ప్రభాకర్ రెడ్డి ,రామాంజి నమ్మ, మారుతి ప్రసాద్, అశ్వర్ధనారాయణ, ఆవుల రెడ్డి ఎన్.బి.కె అభిమాన సంఘం సభ్యులు కిరికెర రాము, ఎన్.బి.కె మూర్తి లతోపాటు అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.