శంఖవరం: శంఖవరం శాఖా గ్రంథాలయంలో బుధవారం కవయిత్రి మొల్ల జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. పెద్దాపురం ప్రధమ శ్రేణి గ్రంథాలయాధికారి పోలంకి నాగరాజు మొల్ల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ మొల్ల రామాయణాన్ని సులువైన పదాలతో తెలుగులో రాసి తన సరళమైన పదజాలానికి అందరూ ముగ్దులయ్యేలా చేసిన కవయిత్రి మొల్ల అని అన్నారు. అనంతరం నాగరాజు శంఖవరం శాఖా గ్రంధాలయం పరిధిలోని పుస్తక నిక్షిప్త కేంద్రాలను సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చెవల ప్రియాంక, రంగా వీరబాబు, రమణ తదితరులు పాల్గొన్నారు.

