రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ‘‘ వ్యూహం‘‘ సినిమాకు లైన్ క్లియర్ అయ్యింది. ఎన్నో అడ్డంకుల తర్వాత రిలీజ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ్యూహం, శపథం సినిమాకు రెండో సెన్సార్ చేయాలని సెన్సార్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. దీంతో సెకండ్ సెన్సార్ చేసి రిలీజ్ కు ఓకే చెప్పారు. దీంతో ఈ నెల 16న ‘‘వ్యూహం‘‘, దీనికి సీక్వెల్‌గా ‘‘ శపథం‘‘ సినిమాను ఈ నెల 23న విడుదలకు ప్లాన్ చేస్తున్నాడు రాంగోపాల్ వర్మ.