అర్థం,పరమార్థం అంటే అబ్బే ఏమిటో
అయినా ఆల్ సింగర్ లే ఎక్కువట…
ఘంటసాల, జేసుదాస్,డీజే తిల్లు ఏదయినా ఊ ఓకే…
వారికి నచ్చితే శభాష్.. నచ్చక పోతే ఇక అంతే…
వారికి సలామ్ కొట్టితే ఓహో ఆహా…
అమ్మగారు మీరు చెప్పిందే నిజం అనాలా
అలా కాదంటే అణగ త్రోక్కేయడం…
ఇదేనా ఇక్కడి కళాసంస్థల తీరు…
అందుకే కౌతాలం కూడా కనీస సౌకర్యాలు ఇవ్వట్లేదట…
విజయవాడ:
వ్యాఖ్యాత అంటే ఎలా ఉండాలి, ఏమి తెలిసుండాలి. ఎలా వ్యాఖ్యానం చేయాలి.. ఎలా వేదిక ఆకట్టుకోవాలి.ఇవన్నీ ప్రాథమిక సూత్రాలు. పాటలు పాడే సమయంలో మాటలు గారడీ చేసి వీక్షకులను వింటే విను పోతే పో అనడం వ్యాఖ్యాత లక్షణము కాదు.అసలు ఏదయిన కార్యక్రమంలో చిన్న చిన్న లోపాలు ఉన్నా సరిగమల్లో సక్రమాలు లేక పోయిన వ్యాఖ్యాత తన నేర్పు,కూర్పు తో ప్రేక్షకులను కవ్విస్తారు.ఇక్కడ భజన ,వారు చెప్పిందే వినాలనడం,వారే వ్యాఖ్యానించిందే అమోఘం, అద్భుతం.అందుకు అవార్డులు రివార్డులు అని నానా హంగామా చేయడం ఆనవాయితీ.అయ్యో ఇదేమిట్ అంటే అంతా మా ఇష్టం, మీకెందుకు ఇదంతా,మా పాటలు, మా సంస్థలు అనడం ఆపై అడ్డగోలు వాదనలు అనవసర వ్యర్థ ప్రసంగాలు చేయడం పరిపాటి.ప్రశ్నిస్తే పాపం,ఎదురిస్తే మీరెక్కడివారు,మీకెందుకు ఇవన్నీ అని ఓ రకమైన బెదిరింపులకు దిగడం కొన్ని కళాసంస్థల అధినేతలు ప్రవర్తిస్తున్నారు.ఓ పెదరాయుడు,మహిస్మతి సామ్రాజ్యం లాగా తీర్పులు,శాసించడం ఎప్పటినుంచో జరుగుతుంది. కాలం విచిత్రమైనదన్న భావన వీరికి లేకపోయిందా లేక కాలాన్ని కూడా వీరే మార్చేస్తారేమో అన్న సందేహం కూడా కలుగుతుంది. సంగీతం ఓ సాధన ద్వారా అద్భుతంగా ఉంటుంది. ఓ రెండుగంటల ముందు యూట్యూబ్ లో విని ఆపై ఆల్ సాంగ్స్ పాడుతాం.. అవన్నీ కూడా అద్భుతాలు అంతే ఆహా ఓహో అని చుట్టున్న వారు పొగడడం ఇది ఇక్కడి తీరు. ఘంటసాల పాటలు కావచ్చు, మంగళం పల్లి బాలమురళీకృష్ణ అయినా, జేసుదాస్ పాటలైన,sp బాలు పాడినవైన సరే,ఆఖరికి శంకరాభరణం సోమయాజులువి కూడా వీరు పాడితే సూపర్ అనాల్సిందే. అలాగే వారు చెప్పిన ఒప్పిన సంస్థలోనే పాడాలి. వారికి నచ్చితే అది ఏ బ్యానర్ అయినా ఓకే వారిలో వారికి ఎక్కడో తేడాలు వస్తే ఆబ్బె చీ అబ్యానర్ లో పాడితే ఆస్కార్ అవార్డ్ పోతుంది. ఈ బ్యానర్లో పాడితే ఆస్కార్ తో పాటు అంతర్జీతీయ సత్కారాలు ఉంటాయని చెప్పడం. ఇవన్నీ మాకెందుకే లే అంటే ఇక అంతే అలాంటి వారిని అనగ ద్రోక్కేయడం.ఇవన్నీ చూస్తున్న కౌతాళం ధర్మసత్రం వారు కూడా వీరంతా ఎప్పుడు ఇక్కడి .నుంచి కాళీ చేస్తే కమ్మగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే రాత్రి అయితే చీకటి రాత్రి చేస్తున్నట్లు, అర్థరాత్రి కూడా అక్కడ ఏమి జరుగుతుందో పరిశీలనకోసం రావడం తప్పనిసరి అవుతుందని కౌతాళం వారే చర్చించుకున్న ట్లు తెలుస్తోంది. మరి ఇలాంటి దుస్థితి నుంచి కళామతల్లికి ఎప్పుడు విముక్తి లభిస్తుందో వేచిచూద్దాం.