భవిష్యత్తులో మరెన్నో, ఉన్నత పదవులు అందుకోవాలని దళిత నాయకులు
మార్కాపురం
మార్కాపురం మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గా ఇటీవల కాలంలో నియమితులైన మార్కాపురం పట్టణ పారిశ్రామిక వాడకు చెందిన వేశపోగు రాజు ను మార్కాపురం పట్టణంలోని ఆమ్ ఆద్మీ డివిజన్ కార్యాలయం నందు మంగళవారం దళిత నేతల ఆధ్వర్యంలో పూలమాలలతో, దుశ్యాలవలతో ఘనంగా సత్కరించి, వారంతా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రాజు మొదటి నుండి కార్మిక సంఘాలలో తోపాటు, దళిత ఉద్యమాలలో సైతం చురుకుగా పాల్గొంటూ ప్రతి ఒక్కరికి సుపరిచితులు. అలాంటి వ్యక్తికి డైరెక్టర్ పదవి రావడం ఎంతో సంతోషమని వారంతా ప్రశంసించారు. అనంతరం ఇలాంటి ఉన్నత పదవులు భవిష్యత్తులో మరెన్నో సాధించాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు వేశపోగు సుదర్శన్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బూదాల సురేష్,కమల్, ప్రదీప్,వేశపోగు దయాకర్, కొమ్ము నవీన్,సింగపోగు పోలయ్య, శ్యాం బాబు, తదితరులు పాల్గొన్నారు.

