జగ్గంపేట
వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల కాలం పూర్తి కావస్తున్న ఆదాయం పెరగలేదని, ఉద్యోగాలు రాలేదని, కానీ జగన్ రెడ్డి ప్రభుత్వంలో పన్నులు భారం ప్రజలపై బాదుడే బాదుడు వేశారని కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ అన్నారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట మండలం భావారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కంచి మణిబాబు ఆధ్వర్యంలో కంచి లక్ష్మీనారాయణ, లంక సూరిబాబు, యనుముల సత్యా నందం, యనుముల రాజశేఖర్, యనుముల సూర్య చక్రం, కంచి శ్రీనివాస్ తదితర సుమారు 10 కుటుంబాలు వైసీపీకి రాజీనామా చేసి జ్యోతుల నవీన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువా లతో టీడీపీలోకి సాధనస్వాగతం పలికిన నవీన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్య నిషేధం దశలవారీగా అమలు చేస్తామని చెప్పి మహిళలకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది నాసిరకం మద్యం వల్ల చనిపోయారని, ఎన్నికలకు ముందు మద్య నిషేధం చేసి ఓట్లు అడుగుతానని చెప్పి మాట తప్పి మడం తిప్పి జగన్ రెడ్డి విశ్వసనీయత కోల్పోయారని చివరకు ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించి, వాటిధరలు భారీగా పెంచిందని విమర్శించారు. జగన్ రెడ్డిని సాగనంపడానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే సమయం ఉందని దీనికోసం ప్రతి ఒక్కరు నడుం బిగించి పనిచేయాలని రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల బంగారు భవిష్యత్తు కోసం కోసం యువత పనిచేయాలని, వారికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే బాధ్యతను జనసేన, తెలుగుదేశం పార్టీలు తీసుకుంటాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బుర్రి సత్తిబాబు, అడబాల వెంకటేశ్వరరావు, కంచి కృష్ణార్జున, పదిలం రాంబాబు, కర్రీ రంగబాబు, నాగం బుజ్జి, పదిలం బుచ్చిబాబు, కంచి సురేష్, పడాల లచ్సబాబు, పదిలం రాజన్న దొర, పడాల చిట్టిబాబు, కూర రాంబాబు, కూర కృష్ణ, నాగం శ్రీనివాసు, పదిలం లోవ దొర, తదితరులు పాల్గొన్నారు.