*కానిస్టేబుల్ గణేష్ కు ఘననివాళి
- గోనుగుంట్ల సూర్యనారాయణ
ముదిగుబ్బ(ధర్మవరం)
జగన్ పాలనలో ప్రజలకేకాక పోలీసులకు రక్షణ లేకుండా పోయిందని ధర్మవరం మాజీఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఆరోపించారు. మంగళవారం స్మగ్లర్ల దాడిలో మృతిచెందిన కానిస్టేబుల్ గణేష్ మృతిదేహానికి బుధవారం ఆయన నివాళులర్పించి వారికుటుంబ సభ్యలైన తల్లి, భార్యకు ధైర్యం చెబుతూ తనవంతు సాయంగా రూ.1లక్ష అందజేస్తూ తాముఅండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆకుటుంబంలో తల్లిదండ్రులతోపాటు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని ప్రభుత్వం ఇచ్చేసాయం ఆకుటుంబానికి సరిపోదని మరింత ప్రభుత్వసాయం ప్రకటించి ఆకుటుంబంలో ఉద్యోగం ఇవ్వడంతో పాటు, పిల్లలకు ఉచితంగా ఉన్నత చదువులు కల్పించడమేగాక వారికి నివాసస్థలంతో పాటు ఇల్లు నిర్మించిఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇసుక మద్యం ఎర్రచందనం విచ్చలవిడిగా తయారైందని ఇదంతా రాయలసీమకు చెందిన మంత్రితో పాటు ముఖ్యమంత్రి జగన్ కనుషన్నుల్లో ఇవన్నీ పురుడుపోసుకొని కొనసాగుతున్నాయన్నారు. వీటిని అరికట్టేందుకు ప్రయత్నించే పోలీసుల ప్రాణాలనే అధికారపార్టీకి చెందినస్మగ్లర్లు హరిస్తున్నారని ఆరోపించారు.