పులివర్తి నాని గెలుపుకు కృషి చేస్తామని వెల్లడి..
చంద్రగిరి:పాకాల మండలం, ఇరంగారిపల్లె పంచాయితీ, పాలినేనివారి పల్లెకు చెందిన 10 వైసీపీ కుటుంబాలు సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని వారికి పసుపు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు నాయుడు సిద్దాంతాలు, పులివర్తి నాని పోరాట పటిమ మమ్మల్ని వైసీపీని వీడేలా చేశాయని అన్నారు. ఒక్క పులివర్తి నాని తోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. ఆయన గెలుపుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి పులివర్తి నాని ధన్యవాదాలు తెలిపారు. పార్టీలో చేరిన వారిలో గుండ్లూరు చిట్టి బాబు,గుండ్లూరు సుగుణమ్మ, గుండ్లూరు హరీష్, గుండ్లూరు వాసుకి లు తలారి పల్లె కు చెందిన కె దాము, పి మదన లు ఉన్నారు.