జగ్గంపేట :వేలంక గ్రామానికి చెందిన చామంతి శ్రీను బలవంతంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు కండువా వేయడంతో మళ్లీ దాన్ని నిరసిస్తూ ఈరోజు జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మాజీ మంత్రి కేఎస్ జవహర్ చేతుల మీదుగా టిడిపి కండువా కప్పుకుని తెలుగుదేశం పార్టీలో కొనసాగుతానని రేపు రాబోయే ఎన్నికల్లో జ్యోతుల నెహ్రూ గారిని సైకిల్ గుర్తు పైన, ఉదయ శ్రీనివాస్ ని గ్లాస్ గుర్తుపైన ఓట్లు వేసి గెలిపించుకుని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి ఎస్ అప్పలరాజు, ఇంటి తమాజీ తదితరులు పాల్గొన్నారు.