పులివెందుల కాంగ్రెస్ ఇంచార్జ్ వేలూరు
పులివెందుల టౌన్
కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి అడుగుజాడలలోని కార్యకర్తల తో పాటు నాయకులంతా నడుస్తామని పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వేలూరు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనవిలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ షర్మిల చేపట్టిన బస్సు యాత్రను ప్రతి నియోజకవర్గంలోని కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రజలు చూపు కాంగ్రెస్ వైపే ఉందని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా ప్రత్యేక హోదా అవసరమని ప్రత్యేక హోదాను ఇచ్చేది తెచ్చేది కాంగ్రెస్ మాత్రమే అన్నారు. విభజన హామీలను బిజెపి విస్మరించిందని తోడుదొంగలైన జగన్, చంద్రబాబు ప్రత్యేక హోదాను అడ్డుపెట్టుకొని నాటకాలు ఆడుతున్నారన్నారు. వైసీపీకి, తెదేపాకు వేసిన ప్రతి ఓటు బిజెపికే చేరుతుందని కాబట్టి ప్రతి ఓటరు ఇది గమనించి కాంగ్రెస్ వైపు నడవాలన్నారు. కాంగ్రెస్ పార్టీని వచ్చే సార్వత్రిక ఎన్నికలలో అఖండ మెజార్టీతో గెలిపించి విజయం కట్టబెడితే కచ్చితంగా ప్రత్యేక హోదా పొందవచ్చు అన్నారు. ఇప్పటికే పరిశ్రమలు లేక నిరుద్యోగ యువత అధికమయ్యారని ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారిందన్నారు. వైకాపా ప్రభుత్వంలో నిత్యవసర సరుకులు విపరీతమైన రేట్లు పెరిగాయి అన్నారు. ఉపాధి కలగాలన్న ప్రజాజీవనం మారాలన్న ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాలని పేర్కొన్నారు. ప్రతి దానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సిద్ధమంటున్నారని దేనికి సిద్ధము చెప్పాలన్నారు .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి నూర్ భాషా, జిల్లా కిషన్ కార్యదర్శి వెంగల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.