పేరు మార్చిన కూటమి నాయకులు
పులివెందుల :పులివెందుల పట్టణంలోని రంగనాథ స్వామి దేవ స్థానం సమీపంలో ఉన్న వైయస్సార్ కూరగాయల మార్కెట్ కు రంగనాథ స్వామి కూరగాయల మార్కె ట్ అని బోర్డును టిడిపి నాయకులు తూగుట్లమధు సూదన్ రెడ్డి, బ్రాహ్మణ పల్లె వెంకట్రామిరెడ్డి, నల్లగా రి భాస్కర్ రెడ్డి, రాష్ట్ర మైనారిటీ సెల్ అధికార ప్రతినిధి మహబూబ్ బాషా,తూగుట్ల సిద్ధారెడ్డి, బిజెపి నాయకులు శశి భూషణ్ రెడ్డి, బిజెపి లక్ష్మయ్య, గోవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జనసేన నాయకుడు జగదీష్ లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తూగుట్లమధుసూదన్ రెడ్డి మాట్లాడు తూ గతంలోనే వైసీపీ నాయకులకు చెప్పడం జరిగిందని టిడిపి ప్రభుత్వం వచ్చిన పది రోజుల్లోనే మార్కెట్ పేరు మారుస్తామని చెప్పానన్నారు. పది రోజుల కిందట కూడా పత్రికా ముఖంగా మార్కెట్ పేరు మార్చాలని లేదంటే మేమే మార్చడం జరుగు తుందని చెప్పడం జరిగిందన్నారు వైకాపా నాయ కులు స్పందించకపోవడంతో ఈ పేరును స్వచ్ఛం దంగా మేమే మార్చడం జరిగిందన్నారు. వంగల శశి భూషణ్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్య మంత్రి హిందువుల జోలికి వెళ్లి వారి మనోభావా లను దెబ్బతీయడంతో రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకున్న కూడా పులివెందులలో వైసీపీ నాయకు లు,కౌన్సిలర్లు అతి ఉత్సాహం చూపుతూ ఉండడం చాలా దారుణం అన్నారు. కౌన్సిలర్లు అందరూ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసి గెజిట్లో పేరు మార్పు చేయాలన్నారు.అనంతరం టిడిపి నాయ కులు మాట్లాడుతూ ఎవరైనా మార్చిన బోర్డును తొలగిస్తే ధర్నాలు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నా మన్నారు. ఎప్పటినుండో ఈ మార్కెట్ కు రంగనాథ స్వామి మార్కెట్ అని పేరు ఉండేదని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పేరు మార్చ డం చాలా దారుణం అన్నారు. స్వచ్ఛందంగా వారి పేరును గెజిట్లో మార్పిస్తే బాగుంటుందన్నారు. కూరగాయల మార్కెట్ కు రంగనాథ స్వామి కూర గాయల మార్కెట్ అని పేరు మార్చడంతో పట్టణం లో ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో కాశీం వలి, రఘు, శ్రీరాములు,టిడిపి నాయకులు,జనసేన నాయకు లు,బిజెపి నాయకులు పాల్గొన్నారు.

