కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గుండ్లకుంట శ్రీరాములు..
కడప సిటీ:యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా కొనసాగుతున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి తక్షణమే పార్టీ అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వాలని బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుండ్లకుంట శ్రీరాములు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సూచించారు. గత ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యే సీట్లు కలిపి 48 బీసీలకు కేటాయించామని చెప్పుకుంటున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో 11 స్థానాలు పెంచి 59 మందికి ఎంపీ ఎమ్మెల్యే సీట్లను సీఎం జగన్ కేటాయించారని, బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేశారని చెప్పుకుంటున్నారు. అలాంటప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీలకు ఎందుకు కేటాయించకూడదని గుండ్లకుంట శ్రీరాములు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో వారసత్వ రాజకీయాలు పనికిరాని ఆయన ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సదర్ పార్టీకి పంపిన లేఖలు బట్టి తెలుస్తుందన్నారు. కాబట్టి ఇప్పటికైనా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీలకు కేటాయించాలని గుండ్లకుంట శ్రీరాములు డిమాండ్ చేశారు.
పాత తేదీలతో ప్రభుత్వ భూములు ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు.మార్చి 15వ తేదీ రెవెన్యూ శాఖ కొన్ని జీఓల ద్వారా అనంతపురం జిల్లాలో 2692 ఎకరాలు , నంద్యాల జిల్లాలో 10,226 ఎకరాలు ఇండో సోల్ సోలార్ ప్రైవేట్ సంస్థకు, అదేవిధంగా గ్రీన్కో సంస్థకు కర్నూలు జిల్లాలో 386 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 4800 ఎకరాలు ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు. ఎన్నికల కోడ్ 16వ తేదీ నుండి అమల్లో ఉండగా 15వ తేదీ విడుదల చేసిన జీవోను 26వ తేదీ గేజిట్ లో చూపించారు. కావున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ యొక్క మొత్తం జీవోలను మొత్తం పరిశీలించి రద్దు చేయాలని కోరారు.
పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ షర్మిళ రెడ్డి కడప జిల్లా పర్యటన మార్చి 28 నుండి ఏప్రిల్ 1వ. తేదీకి అనివార్య కారణాలవల్ల వాయిదా పడిందని విలేకరుల సమావేశంలో శ్రీరాములు పేర్కొన్నారు.
విలేఖర్ల సమావేశంలో పాల్గొన్న వారు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు విష్ణు ప్రీతం రెడ్డి, పిసిసి డెలిగేట్ పొట్టిపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మూలంరెడ్డి ధ్రువ కుమార్ రెడ్డి, పిసిసి మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోపూరు వెంకటరమణారెడ్డి, వేమయ్య, రామకృష్ణ అలియాస్ బద్రీ పాల్గొన్నారు.