వన్నె రెడ్డి, వన్నియకుల క్షత్రియ జైత్రయాత్ర రాయలసీమ రీజినల్ మహాసభను విజయవంతం చేయాలని రష్ హాస్పిటల్ అధినేత ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం కోరారు
రేణిగుంట
శ్రీకాళహస్తిలో ఆదివారం జరిగే వన్నె రెడ్డి, వన్నియకుల క్షత్రియ జైత్రయాత్ర రాయలసీమ రీజినల్ మహాసభను విజయవంతం చేయాలని రష్ హాస్పిటల్ అధినేత ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం కోరారు. రేణిగుంటలో శుక్రవారం సాయంత్రం వన్నెకుల క్షత్రియలతో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం సమావేశం అయ్యారు. శ్రీకాళహస్తిలో జరిగే సదస్సులో ప్రతి ఒక్క వన్నెకుల క్షత్రియులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ నాలుగు జిల్లాలకు సంబంధించిన వన్ని రెడ్డి, వన్నికుల క్షత్రియుల అతి పెద్ద మహాసభను శ్రీకాళహస్తిలో నిర్వహిస్తున్నామని అన్నారు. మునుపెన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వన్ని రెడ్డి లను గుర్తించి పదవులు పట్టం కట్టారని కొనియాడారు. రానున్న ఎన్నికలలో శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్ రెడ్డిని, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునేందుకు వన్నెకుల క్షత్రియులంతా సంసిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వన్నె రెడ్డి నాయకులు మురుగేషన్, శంకరయ్య, మహిళలు రుక్మిణి, బిందు, తులసి, నీలిమ, తదితరులు పాల్గొన్నారు.