రాప్తాడు:వైకాపాతోని రాష్ట్రం అభివృద్ధి అని ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి సంక్షేమ అభివృద్ధిని సాధిద్దామని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు . మండల పరిధిలోని మైనారిటీ కాలనీలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రచార జోరు సాగించారు . కాలనీలోని ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటికి లబ్ధి పొందింటేనే వైకాపాకు ఓటు వేయండి అని ప్రజలను కోరారు , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ విడతల వారీగా నెరవేర్చారని ఇల్లు లేని నిరుపేదలకు అర్హత ప్రామాణికంగా ఇంటి పట్టాల మంజూరు చేసామని పేర్కొన్నారు మళ్లీ ఒకసారి రాష్ట్ర అభివృద్ధి బాటలో చెందాలంటే ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి ఎమ్మెల్యేగా నన్ను , ఎంపీగా శాంతమ్మను గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ జూటూరు శేఖర్ , మండల ఎన్నికల ఇన్చార్జ్ సత్యనారాయణ రెడ్డి, వైస్ ఎంపీపీ బోయ రామాంజనేయులు, జయన్న, కాంట్రాక్టర్ చంద్ర, సింగారప్ప, చెన్నారెడ్డి, లోకేశ్వర్ రెడ్డి , బీరప్ప, అభి, తదితర వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.