- తొలి నుండి తెదేపాలో కొనసాగిన 20 కుటుంబాలు
- నేడు వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పుకున్న ముంగిలి పట్టు ప్రజలు
- పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
తిరుపతి రూరల్,
చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో వైఎస్ఆర్సీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. చంద్రగిరి మండలం ఎం.కొంగరవారి పల్లి పంచాయతీ ముంగిలి పట్టుకు చెందిన 20 కుటుంబాలు తొలి నుండి తెదేపాలో కొనసాగి.. నేడు వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పుకున్నారు. సోమవారం తుమ్మలగుంటలోని నివాసం వద్ద తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చొరవ, చేపట్టిన అభివృద్ధి పనులు, నా అనుకుని ప్రజలకు చేస్తున్న సేవాతత్వానికి ఆకర్షితులై పార్టీలో చేరినట్లు ముంగిలి పట్టుకు చెందిన 20 కుటుంబాలు పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లా యూత్ జాయింట్ సెక్రటరీ యశ్వంత్ చౌదరి ఆధ్వర్యంలో చేరిన వారిలో కె.నారాయణ స్వామి, టి.మురళి, కె.సురేష్, టి. సీమాన్, కె గణేష్, డి. రాజేంద్ర, పేదర్, ఐ.రాజేష్, కె.మాధవి, టి.పరిమళ, జి.రేణుక, టి. తంగమని, కె.లక్ష్మీదేవి, ఐ.మాధవి, కె. రెడ్డమ్మ, పి.సరస్వతి తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విజయమే కాదు అత్యధిక మెజారిటీ కోసం మా వంతు బాధ్యతగా కృషి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పంచాయతీ అధ్యక్షులు బాబు నాయుడు, సుధాకర్ , చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.