Friday, May 9, 2025

Creating liberating content

తాజా వార్తలువేసవి కాలం నుండి ప్రజలను కాపాడేందుకు ప్రణాళికలు సిద్ధం చేయండి

వేసవి కాలం నుండి ప్రజలను కాపాడేందుకు ప్రణాళికలు సిద్ధం చేయండి

రాజంపేట ఎమ్మెల్యే మేడ వెంకట మల్లికార్జున్ రెడ్డి ఎంపీపీ గడ్డం జనార్దన్ రెడ్డి మృతి పై రెండు నిమిషాలు మౌనం పాటించిన ప్రజా ప్రతినిధులు మండలంలో కొత్తగా మంజూరైన ఇంటి పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మేడ

ఒంటిమిట్ట:నీతి నిజాయితీకి మారుపేరు మరియు మన వైఎస్ఆర్సిపి పార్టీకి ఎంతో విధేయుడుగా కష్టపడిన వ్యక్తి స్వర్గీయ వైస్ ఎంపీపీ గెడ్డం జనార్దన్ రెడ్డి ఈరోజు మన మధ్యలో లేకుండా పోవడం మన దురదృష్టకరమని రాజంపేట శాసనసభ్యులు మేడా వేంకట మల్లికార్జున్ తెలిపారు మంగళవారం నాడు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మండల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వేసవికాలం నుండి ప్రజలను కాపాడేందుకు ప్రాణాలికలు సిద్ధం చేయండి అని రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి అన్నారు ఒంటిమిట్ట మండలంలో కొత్తగా మంజూరైన ఇంటి స్థలాలు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగినది వేసవికాలం ప్రారంభం అయినందున సూర్యుడి ప్రతాపం నుండి ప్రజలను కాపాడేందుకు ప్రణాళికలను మండల అధికారులు సిద్ధం చేసుకోవాలని రాజంపేట శాసనసభ్యులు మేడా వేంకట మల్లికార్జున్ రెడ్డి ఆదేశించారు.మంగళవారం మండల కేంద్రమైన ఒంటిమిట్ట లో గల మండల పరిషత్ కార్యాలయం నందు నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. సమావేశం ప్రారంభానికి ముందు సభలో స్వర్గీయ వైస్ ఎంపీపీ గెడ్డం జనార్దన్ రెడ్డి మృతి పట్ల రెండు నిమిషాల పాటు అధికారులు, ప్రజా ప్రతినిధులు మౌనం పాటించి,ఆయనను తలుచుకుంటూ కొన్ని మంచి మాటలను చెప్పుకొచ్చారు. అనంతరం సభ ప్రారంభం కావడంతో మండలంలోని పలు శాఖల సమస్యలను,వాటి పరిష్కారాల గురించి ఎమ్మెల్యే గారు అధికారులతో చర్చించారు. ఇందులో ముఖ్యంగా పెన్న పేరూరు లోని ఏడో విడత భూ పంపిణీ, అలాగే పెన్నా నదిలో ఉన్న సి పి డబ్ల్యూ సి నీటి సరఫరా సమస్య గురించి,చింతరాజు పల్లి, చిన్న కొత్తపల్లి, నడవకాటి పల్లిలో గత కొద్ది రోజుల కిందట నుంచి ఉన్న తాగునీరు సమస్యల పరిష్కారాని గురించి ఆర్డబ్ల్యూఎస్ ఏఈ తో చర్చించారు అనంతరం ఒంటిమిట్ట మండలం లో కొత్తగా మంజూరైన ఇంటి స్థలం పట్టాలను ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట మండల అధ్యక్షురాలు, ఎంపీపీ అక్కి లక్ష్మీదేవి,వైస్ ఎంపీపీ డాక్టర్ భోగా గీతాదేవి,రాష్ట్ర గిడ్డంగుల శాఖ డైరెక్టర్ ఆకేపాటి వేణుగోపాల్ రెడ్డి, వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షుడు గజ్జల శ్రీనివాస్ రెడ్డి, సచివాలయ కన్వీనర్ రఘునాథరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు ముమ్మడి నారాయణరెడ్డి,గంగా పేరూరు అబిరెడ్డి,కో ఆప్షన్ నెంబర్ మహమ్మద్ రఫీ, మైనార్టీ నాయకులు డీలర్ మస్తాన్, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు సత్తార్,టి శివారెడ్డి, సర్పంచ్ కత్తి సుజాత ఎంపీటీసీ లు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article