ఎంపీపీ,జెడ్పీటీసీ
వేముల
వేముల మండలం ను ప్రతి ఒక్కరూ ఆదర్శ మండలం గా తీర్చి దిద్దటనికి సహకరించాలని ,అలాగే ముఖ్యమంత్రి ఆశయాల కు అనుగుణంగా పని చేద్దాం అని వేముల మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు చల్లా గంగా దేవి
జెడ్పీటీసీ కోకటం వెంకట బయపు రెడ్డి
పేర్కొన్నారు.బుధవారం ఉదయం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ చల్లా గంగా దేవి వెంకట నారాయణ అధ్యక్షతన,మండల సర్వసభ్య సమావేశం ను ఎంపిడిఓ ఏ విజయ రాఘవ రెడ్డి
అధ్వర్యంలో నిర్వహించారు,జెడ్పీటీసీ కోకటం వెంకట బయపు రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా ఎంపీపీ చల్లా గంగా దేవి జెడ్పీటీసీ కోకటం వెంకట బయపు రెడ్డి ,మండల సర్వ సభ్య సమావేశం లో మాట్లాడుతూ,మండలం లో అన్నీ పంచాయతీ లలో పక్కా గృహాలు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు,అలాగే గ్రామాలలో
వేసవి సమీపిస్తోంది అని ఎక్కడ నీటి సమస్య లేకుండా చూడాలని అలాగే , ముఖ్యం గా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు,సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని,ప్రతి పథకం లబ్దిదారులకు చేరాలని అధికారులకు దిశ నిర్దేశం చేశారు.అదికారులు తప్పకుండా సమయ పాలన పాటించాలని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి,ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అధ్వర్యంలో లో పాడ నిధులతో వేముల మండలం లో అనేక సంక్షేమ పథకాలను చేపట్టినట్లు తెలిపారు, వ్యవసాయ అధికారి చెన్నా రెడ్డి మాట్లాడుతూ మండల వ్యాప్తంగా పంట నమోదు చేస్తున్నాం అని కావున ప్రతి రైతు పంట నమోదు చేసుకోవాలని అన్నారు,ఉద్యాన శాఖ అధికారి రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ క్రాప్ నమోదు చేసుకోవాలని, అలాగే చిని రైతులు సాగులో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. ఆర్డబ్ల్యూఎస్ శివారెడ్డి మాట్లాడుతూ పాడా నిధుల ద్వారా మండల వ్యాప్తంగా ఇంటింటికి మంచినీటి పథకం లో భాగంగా కుళాయి కనెక్షన్ ఇస్తున్నామని, అంతేకాకుండా ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మిస్తూ బోరుబావులు ద్వారా మంచి నీరు అందిస్తున్నామని, పలు గ్రామాలలో అండర్ డ్రైనేజీ చేపట్టామన్నారు. ఆసరా, అనేక సంక్షేమ పథకాలు, ఉపాధి పనులపై ఆయా శాఖల అధికారులు,వివరణ ఇచ్చారు. ముఖ్యంగా గ్రామాలలో విద్యుద్దీపాలు పై, పారిశుధ్యం పై శ్రద్ధ తీసుకోవాలన్నారు, అంతేకాకుండా ఎక్కడా తాగునీటి సమస్య లేకుండా పరిష్కరించాలన్నారు.అలాగే గ్రామాలలో వైద్య సిబ్బంది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో వరుసగా రెండో సారి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ను చేపట్టినట్లు తెలిపారు.ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా మండలం లో 65 మందికి గుండె ఆపరేషన్ లు చేపించం అని అలాగే నులిపురుగుల నివారణ కోసం టాబ్లెట్ లు పంపిణీ చేస్తున్నాం అని అలాగే మార్చి లో పోలియో చుక్కలు వెస్తం అని డాక్టర్ అఫ్రిన్ తెలిపారు.మండలం లో ఏదైనా చిన్న చిన్న పెండింగ్ పనులు ఉంటే సర్పంచ్ నిధులు నుంచి పూర్తి చేయాలని
తెలిపారు,అలాగే మండలం కి పాడ ద్వారా 750 విది దీపాలు మంజూరు అయ్యాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు,ఏపీవో నాగ సులోచన ,ఏపియం మంజునాథ,సర్పంచ్ ,సాకే రమంజనమ్మ,కో ఆప్షన్ సభ్యులు మండి.మా పీరా,అదికారులు,అదికారులు ఉన్నారు.