వెలుగొండ.ప్రాజెక్ట్ను.పూర్తిఅయ్యిందని కలరింగ్ ఇచ్చి పైలాన్ ను ఆవిష్కరించటమెంటి ముఖ్యమంత్రి
మార్కాపురం :మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా కందుల నారాయణర రెడ్డి మాట్లాడుతూ పూర్తికాని వెలుగొండ ప్రాజెక్టు నకు పూర్తయినట్టు చూపించి పైలాన్ ను ఆవిష్కరించటం పట్ల ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు. నాకు తెలుగుదేశం ప్రభుత్వ హయంలో వెలిగొండ ప్రాజెక్టు దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయని గత 4 సంవత్సరాల 11 నెలల వైసిపి ప్రభుత్వం మిగిలిన 10% పనులు కూడా పూర్తి చేయలేక ప్రజలకు సమాధానం చెప్పలేక ఎన్నికలు వస్తున్నాయి అని గ్రహించి ప్రాజెక్టు పూర్తి అయినట్టు కల్లబొల్లి కబుర్లు చెప్తున్నారు అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు స్పందించారు. రెండవ టన్నెల్ 5 మీటర్ల వ్యాసార్థమే త్రవ్వి పూర్తయినట్టు కలరింగ్ ఇవ్వడం నిజమా? కాదా
నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీ డబ్బులు ఇప్పటికి ఇవ్వకుండా ప్రాజెక్టు పూర్తయిందని చెప్పడం వాస్తవమా? కాదా కీలకమైన ఫీడర్ కెనాల్ కు లైనింగ్ పనులు పూర్తి చేశారా లేదా
సొరంగంలో ఉన్న మట్టిని పూర్తిగా తొలగించారా? లేదా పైవన్నీ పూర్తి చేయకుండా వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసామని చెప్పి ప్రాజెక్టును ప్రారంభించినట్టు పైలాన్ ఆవిష్కరించడం ప్రజలను పూర్తిగా వంచించడమేనని అన్నారుఈ వైసీపీ పాలలో రాష్ట్రంలో విధ్వంసం మిగిలింది తప్ప ఎక్కడైనా మచ్చుకు కూడా అభివృద్ధి కనిపించడం లేదు అని అన్నారు.వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయబోయేది వచ్చే తెలుగుదేశం ప్రభుత్వమేనని ప్రజలు వైసిపి నాయకుల మోసపు మాటలు నమ్మకుండా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలన్నారు ఈ ప్రెస్ మీట్ లో పట్టణ తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.