Friday, September 12, 2025

Creating liberating content

తాజా వార్తలువెలమ కొత్తూరులో యనమలకు చెక్కు చెదరని ప్రజాబలం

వెలమ కొత్తూరులో యనమలకు చెక్కు చెదరని ప్రజాబలం

జాతరను తలపించిన మీ ఇంటికి మీ దివ్య

తుని ‌ ‌

గుర్తుకొస్తున్నాయీ.. యనమల హయాంలో అద్వితీయమైన ప్రగతి సాధించి జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకున్న అలనాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకొన్న వెలమ కొత్తూరు ప్రజలు.. ప్రగతి కృషివలుడు యనమల రామకృష్ణుడి రాజకీయ‌‌ వారసరాలు తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ యనమల దివ్య కు జయ జయ ధ్వనాలతో ఎదురీగి, బ్రహ్మరథం పట్టారు. వెలమ కొత్తూరులో మూడు రోజులపాటు కొనసాగిన మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం జాతరను తలపించింది.1983 నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలిచిన వెలమ కొత్తూరు ప్రజలు ప్రతి ఎన్నికల్లోనూ యనమలకు ఓట్ల వర్షం కురిపించి, రామకృష్ణుడి విజయం వెనుక నిలిచారు.అయితే వైసీపీ వేవ్ లో అటువైపు మొగ్గు చూపిన మాట వాస్తవం.జరిగిన తప్పిదంపై పునరాలోచన పడ్డ ప్రజలు, రియల్ లీడర్ సుర్ల లోవరాజు నాయకత్వంలో జన నేత్రి యనమల దివ్యకు అఖండ మెజారిటీతో అసెంబ్లీకి పంపిస్తామంటున్నారు.సౌమ్యతకుమారుపేరయిన లోవరాజు చాకచక్యంతో దూరమైన వారందరిని తిరిగి తెలుగుదేశం వైపు ఆకర్షితులు చేయడంలో సక్సెస్ అయ్యారు.ఈ నేపధ్యంలో మూడు రోజులపాటు జరిగిన మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమాన్నికి జనకెరటం ఎగిసిపడింది.బాబు ష్యూరిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించింది.యనమల తనయురాలు దివ్యపై మమతానురాగాలు కురిపించారు.చెక్కుచెదరని ప్రజాబలం తో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం సూపర్ హిట్టయ్యింది.మీ ఇంటికి మీ దివ్య చివరి రోజు కార్యక్రమం జన ఉప్పెనతో సాగింది. ఇవాళ హైవేని ఆనుకొని ఉన్న వెల్లంపేట కాలనీలో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమానికి విచ్చేసిన యువ నేత్రి యనమల దివ్యపై స్థానికులు పూల వర్షం కురిపించారు. తాండవసుగర్స్‌‌ మాజీ చైర్మన్ లోవరాజు ఆధ్వర్యంలో‌ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ యనమల దివ్య రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి యనమల కృష్ణుడు తో కలిసి మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లిన యనమల బిడ్డకు మంగళ హారతులతో మహిళలు బ్రహ్మరథం పట్టారు. తెలుగుదేశం జనసైనికులతో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో యనమల దివ్య తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా దివ్య మాట్లాడుతూ వెలమ కొత్తూరు గ్రామస్తులు చూపించిన ఆదరాభిమానాలకు‌ ధన్యవాదాలు తెలుపుతూ ఇదే స్ఫూర్తితో రేపటి ఎన్నికల్లో చరిత్రను తిరగరాసేలా తనకు మెజార్టీని కట్ట పెట్టాలని కోరారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి యనమల కృష్ణుడు మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన పార్టీలకు తిరిగేలేదని.. మరో రెండు నెలలో ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో పోల్నాటి శేషగిరిరావు, మోతుకూరి వెంకటేష్, యనమల శివరామకృష్ణ, జనసేన సమన్వయకర్త చోడిశెట్టి గణేష్, అప్పన రమేష్,మాజీ సర్పంచ్ తమరాన సత్యనారాయణ తమరాన రామకృష్ణ , రొంగలి సత్యనారాయణ, కర్రీ తాతలు, వంగలపూడి బుజ్జి, చింతంనీడి అబ్బాయి, పోతల రాంబాబు, జక్కాన రామనాయుడు,గజ్జి రాంబాబు, జనసేన శివ, గుండా రమణ, నల్ల మట్టి రాము, వంగలపూడి వంశీ, గాదివరహాలు బాబు, దాసరి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article