Thursday, May 8, 2025

Creating liberating content

తాజా వార్తలువెట్టిచాకిరి చేయిస్తే కఠిన చర్యలు:న్యాయ సేవాధికార సంస్థ

వెట్టిచాకిరి చేయిస్తే కఠిన చర్యలు:న్యాయ సేవాధికార సంస్థ

కనిగిరి

బాండెడ్ లేబర్ నిర్మూలన దినోత్సవం పురస్కరించుకొని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు కనిగిరి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్,జడ్జి కె.భరత్ చంద్ర నేతృత్వంలో కనిగిరి పట్టణం లోని అసంఘటిత కార్మికులకు,దుకాణ, హోటల్ యజమానులకు మండల న్యాయ సేవాధికార సంస్థ, గుడ్ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.కనిగిరి మున్సిపల్ చైర్మన్ న్యాయవాది షేక్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ మిల్లులు,ఇటుకల బట్టీలు,బేలుదారి పనులు,వ్యవసాయ సంబంధిత పనుల్లో పిల్లలు, మహిళలు, మగవారు బానిసలుగా పనిచేస్తున్నారని అన్నారు.తండ్రి , తాతలు చేసిన అప్పులు తీర్చలేకపోతే పిల్లలతో వెట్టి చాకిరీ చేయిస్తున్న సంఘటనలు ఇప్పటికీ సమాజంలో కనిపిస్తున్నాయని వెట్టి చాకిరి నుండి ప్రజలను విముక్తి చేయడానికి అందరూ సహకరించాలని అన్నారు. వెట్టి చాకిరి నిషేధం చట్టం
కనీస వేతన చట్టం,బాల కార్మిక నిషేధ చట్టం,అక్రమంగా తరలింపు చట్టాలపై ప్రజల్లో అవగాహన కలిగించారు.అధికారులు,స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రజలను చైతన్యవంతులను చేసి జిల్లాను బాండెడ్ లేబర్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని చైర్మన్ అన్నారు.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 23, 24 పౌరులు దోపిడి నుండి రక్షణ పొందే హక్కును కల్పిస్తున్నాయని ఆర్టికల్ 23 ప్రకారం మనుషుల క్రయవిక్రయాలు, బలవంతపు చాకిరీ నిషేధించబడిందని ఈ నిబంధన ఉల్లంఘించినవారు చట్టరీత్యా శిక్షార్హులు అని అవగాహన కలిగించారు.ఆర్టికల్ 24 ప్రకారం 14 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం నిషేధించబడిందని తెలిపారు.అనంతరం హోటళ్లు,టి దుకాణాలలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి వారికి బాండెడ్ లేబర్ నిషేధ చట్టం పై అవగాహన కలిగించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సుబ్బరాయుడు, ఎస్ బి సి సి సభ్యులు, కైలాస్ సత్యార్ది చిల్డ్రన్ ఫౌండేషన్, సార్డ్స్ సంస్థ కోఆర్డినేటర్ కిరణ్ కుమార్, న్యాయవాది షాహిద్,పారా లీగల్ వాలంటీర్ గుడ్ హెల్ప్ రమేష్ బాబు,న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article