Saturday, May 10, 2025

Creating liberating content

సినిమావెంకటేష్ 76 మూవీ ఎఫ్ 4 ?

వెంకటేష్ 76 మూవీ ఎఫ్ 4 ?

విక్టరీ వెంకటేష్ ఈ మధ్యనే సంక్రాంతి పండగ సమయంలో సైంధవ్ అనే మూవీ తో అభిమానుల ముందుకు వచ్చారు.ఈ సినిమాలో వెంకటేష్ యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కూతురు సెంటిమెంట్ తో వచ్చిన సైంధవ్ మూవీ అభిమానులను అంతగా ఆకట్టుకోలేదని చెప్పుకోవచ్చు.దాంతో ఈ సినిమా ప్లాఫ్ అయ్యింది. సైంధవ్ మూవీ వెంకటేష్ 75వ సినిమా కావడంతో డైరెక్టర్ శైలేష్ కొలను ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమా ఫంక్షన్ లో కూడా చిరంజీవి తో పాటు కొంతమంది యంగ్ హీరోలు కూడా పాల్గొన్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యాక వెంకటేష్ నెక్స్ట్ మూవీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఉంటుందని ఆ మధ్యకాలంలో ఫిలిమ్ ఇండస్ట్రీ నుండి టాక్ వినిపించింది. కానీ గత రెండు మూడు రోజుల నుండి వెంకటేష్ నెక్స్ట్ సినిమా గురించి ఒక క్రేజీ టాక్ వినిపిస్తోంది.. ఇంతకీ వెంకటేష్ ఏ డైరెక్టర్ తో చేయబోతున్నారో అనుకుంటున్నారా.. ఆయన ఎవరో కాదుఇప్పటికే వెంకటేష్ తో రెండు సినిమాలకు దర్శకత్వం వహించి థియేటర్లలో అభిమానులతో నవ్వులు పూయించిన అనిల్ రావిపూడి.. అనిల్ రావిపూడి దర్శకుడిగా చేసిన ఎఫ్2,ఎఫ్ 3 మల్టీస్టారర్ సినిమాల్లో వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన సినిమాలు అభిమానులను అలరించాయి.మరీ ముఖ్యంగా ఇందులో ఉండే కామెడీ ఎంతో బాగా పండింది.. అయితే తాజాగా అనిల్ రావిపూడి తో ఎఫ్ 4 (F4) సినిమా చేయడానికి వెంకటేష్ రెడీ అయిపోయినట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ మార్చి 8 అనగా మహాశివరాత్రి రోజు నా బయట పెడతారని తెలుస్తోంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article