పోరుమామిళ్ల:ఎవరు ఎట్ల పోతే మనకేమి అనే రోజుల్లో మండుటెండల్లో నడవలేని స్థితిలో ఓ వృద్ధురాలు బాధను చూచి స్పందించిన ప్రభుత్వ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాలలోకి వెళితే శనివారం పోరుమామిళ్ల గ్రామంలో 95 సంవత్సరాల ఒక వృద్ధురాలు పెన్షన్ కోసం మండుటెండలో మధ్యాహ్నం మూడు గంటలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి రావడం జరిగింది. నడవలేని పరిస్థితుల్లో ఉన్న అవ్వను అడ్వైజర్ నాగార్జున రెడ్డి చూసి ఆమెను స్టేట్ బ్యాంక్ లోకి చేపట్టుకొని తోడుకొని పోవడం పెన్షన్ ఇప్పించడం జరిగిందని ఇలా చాలామంది రాష్ట్రంలో పెన్షన్ల కోసం ఎండకు వడగలుపులకు తట్టుకోలేక పదుల సంఖ్యలో చనిపోవడం జరిగిందని గతంలో వాలంటీర్లు ఇంటి దగ్గరికి వచ్చి ఇవ్వడం జరిగేదని కానీ ఇప్పుడు రాజకీయ కక్షతో తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కుట్రలో భాగంగా వాలంటీర్ల ద్వారా కాకుండా ఆఫీసు దగ్గరికి బ్యాంకులు దగ్గరికి పోయి తెచ్చుకోమని చెప్పడం అందులకు వారు పోవడం ఎండ వేడి మీకు తట్టుకోలేక చనిపోవడం జరిగిందని దీనంతటికీ కారణం తెలుగుదేశం పార్టీ వారే అని పేర్కొన్నారు. పెన్షన్ వచ్చే వారందరూ కూడా గమనించి మళ్లీ జగనన్న ముఖ్యమంత్రి అయితేనే ఇంటి దగ్గరికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని లేకుంటే ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే ఇలాగే ఉంటుందని కావున ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా తెలియజేశారు.