వృద్ధాప్యంలో ఉన్న అత్త సంరక్షణ బాధ్యతను చూసుకోవాల్సింది కోడలేనని, అది మన సంస్కృతీ సంప్రదాయాల్లోనే ఉందని ఝార్ఖండ్ హైకోర్టు పేర్కొంది. ఓ విడాకుల కేసు సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వృద్ధులైన అత్తమామలు, లేదా భర్త నాయనమ్మకు సేవ చేయడం స్త్రీ బాధ్యత అని ..అదొక సాంస్కృతిక ధర్మమని తెలిపింది. వారి నుంచి విడిపోయి వేరుగా కాపురం పెట్టాలని భర్తపై ఒత్తిడి తీసుకురావడం సమంజసం కాదని జస్టిస్ సుభాష్‌చంద్ స్పష్టం చేశారు. అంతేకాదు, ఎలాంటి కారణం లేకుండా భర్త నుంచి విడిపోయినట్టయితే మనోవర్తి పొందేహక్కు భార్యకు ఉండదని పేర్కొన్నారు.