*వీరికి కప్పం కడితే అక్రమ కట్టడాలు కట్టుకోవచ్చా…
- వీరికి లంచాల కోడం ఎన్ని లాలూచీ పనులైన చేస్తారేమో..
- వీరి అక్రమాల కోసం ఎన్ని అక్రమాలైనా చేస్తారా..
- ఈ అక్రమాలు సక్రమాలు చేయడానికేనా వీరి ఉద్యోగం.
- వీరి అక్రమాలకు అండ దండ చీఫ్ సిటీ ప్లానర్ ఉన్నట్లేనా….
*కట్టడం కట్టడం వెనుక ఎన్ని కక్కుర్తి పనులో మరి… - కూటమి ప్రభుత్వ మైనా… ఏ ప్రభుత్వమైనా ఇంతేనా..
- పశ్చిమ లోనే ఎందుకింత అరాచకం…
- ఎమ్మెల్యే సుజనా చౌదరి ఉన్నా కూడా …?
- పశ్చిమ లోనే ఇలా ఎందుకు…!
- ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసే వారేలేరా…?
(రామమోహన్ రెడ్డి)
తమ అవినీతి కోసం అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తూ తమ కడుపు నింపు కోవడం కోసం కార్పొరేషన్ ఆదాయనికి గండి కొడుతున్న కక్కుర్తి అధికారుల తీరు చూస్తుంటే ఇదేనా ఈ కార్పొరేషన్ అధికారుల తీరని ఆశ్చర్య పోతున్నారు అక్కడి ప్రజలు.ఈ అధికార యంత్రాంగం దోచుకు తినడానికి సిద్ధపడుతూనే ఉన్నారంటే ఎవరిని అడగాలి.. ఎమని ప్రశ్నించాలానే ఆలోచన మొదలవుతుంది.
లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ తమ సిరా చుక్క కోసం రక్తపు చుక్కలను సైతం వదలని విదంగా అనుమతులు ఇవ్వడానికి అక్షరాల లక్షలు కావాలని అడగడం ఇవ్వకపోతే అడ్డంకులు సృష్టించడం ఇస్తే ఏ ఆటంకాలు లేకుండా అక్రమ నిర్మాణాలు చేసుకునేలా దగ్గరుండి అనుమతులు మంజూరు చేసి అతిపెద్ద నీతి మాలిన మాటలు మాట్లాడుతూ మాయలో ముంచడం ఈ మున్సిపల్ అధికారులకే చెల్లుతుందని చెప్పక తప్పడం లేదు. బెజవాడ కార్పొరేషన్ లోని పశ్చిమ నియోజకవర్గ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపూ లేకుండా పోతుందని పత్రికలు ఘోషిస్తున్న పట్టించుకున్న పాపాన పోవడం లేదనే విమర్శలు వచ్చిపడుతున్నాయి.
నేటి పాలకుల కంటె గత పాలకులే ఎంతో మేలని కూటమి నాయకులే కొందరు కార్పొరేషన్ కు గండి కొట్టి కొత్త కొంప కట్టుకునే వారి కొంపలు కొల్లగొట్టి తమ కొంపలు బాగుచేసుకుంటుంటే అడిగే నాధుడు కరువయ్యారనే విమర్శలు లేకపోలేదు.పశ్చిమ నియోజకవర్గ లోని బిల్డింగ్ ఇన్స్పెక్టర్ లు నాటి కంటే ఎక్కువగా అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇస్తూ తమ సంచులు నింపుకుంటుంటే ఆ అవినీతి అధికారులపై చర్యలు తీసుకునే వారు లేరా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇందుకు నిదర్శనంగా వన్ టౌన్,43 డివిజన్ ,40 డివిజన్,భారతీనగర్ హరినారాయ వీధి,46 డివిజన్ రాజివ్ శర్మ నగర్ ,53 డివిజన్ పాపయ్య నాయుడు వీధి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను ఉన్నతాధికారులు పరిశీలిస్తే పెద్ది ప్రసాదం ఎంత ముట్టింది, అంజిబాబు బాగానే ఇచ్చుకున్నాడా మురళీ గానం ఎంత బాగా వినపడిందో అట్లే అర్ధమవుతుంది. ఆయితే ఈ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ల అవినీతి పై ఉన్నతాధికారులకు పిర్యాదు చేయడం కోసం స్పందన ,కార్పొరేషన్ పిర్యాదు విభాగంలో ఇచ్చిన కూడా అక్కడ ఉండే సిబ్బంది నే కాదు ఆఖరికి కమిషనర్ కు కూడా కాసులివ్వనిదే ప్లాన్ ఇవ్వడం కుదరదని చెప్పుకొస్తుండటం తో నిర్మాణ దారుల్లో కొంతమంది అడిగినంత ఇచ్చుకో వడం జరుగుతుండగా బ్రోకర్ లు ,అక్రమ నిర్మాణ దారులు అడ్డగోలు వ్యవహారం చేసుకోవడం అనుకున్న అంతస్తులు హాయిగా అనుమతులు అరకొర ఉన్నట్లు చూపించడం నిర్మాణం చేపట్టడం పరిపాటిగా మరిపోతూనే ఉంది.ఇక ఆయా కార్పోరేటర్ ల సంగతి చెప్పనక్కర్లేదు. అందిన కాడికి మొదట వారే దోచుకోవడం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ కండువా కప్పుకుని తమ కక్కుర్తి పనులు చేసుకోవడం మళ్ళీ కార్పొరేషన్ మీటింగ్ లలో కహానీ మాటలు మాట్లాడి అబ్బా అనిపించుకోవడానికి ప్రయత్నం చేయడం అలవాటుపడిన సందర్భంలో ఈ అక్రమ కట్టడాలకు కళ్లెం వేసేదేవరు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆ ఏరియా ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యే ఈ అధికారుల తీరుపై ఆలోచన చేసే తీరిక లేదా ఆయన కూడాఅమ్యామ్యా కు అలవాటు పడ్డాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కూటమి ప్రభుత్వంలో ఏదో ఒక పార్టీని ఆశ్రయించిన ఈ అక్రమ నిర్మాణ దారులు అంతా మనవారే అని అనుకోవడం అమ్యామ్యా చేసుకోవడం అంతా మామూలే అన్న ధోరణి ఏర్పడినట్లు తెలియ వస్తుంది.దీనితోఈ నీతి లేని అధికారులు కూడా నాకింత నీకింత అని అనుకుంటూ అప్పనంగా దోచుకుంటున్న ట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకు నిదర్శనం గా పశ్చిమ నియోజకవర్గ పరిధిలో వెలుస్తున్న అక్రమ కట్టడాలను చూస్తే అట్లే అర్ధమవుతుంది. ఇలాంటి అవినీతి అధికారులున్నంత కాలం ఈ అక్రమ కట్టడాలు ఆగవన్న తీరు అక్కడ నెలకొన్నది.






