లేపాక్షి : శిల్పకళా రామంగా పేరొందిన లేపాక్షి వీరభద్రాలయ ఆలయ హుండీ ఆదాయం రికార్డ్ స్థాయిలో 5,68,870 రూపాయలు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి, వీరభద్రాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రమానందన్ లు తెలిపారు. నాలుగు నెలలకోసారి హుండీని లెక్కించడం ఆనవాయితీగా వస్తోంది. మంగళవారం ఆలయ కార్య నిర్వహణాధికారి నరసింహమూర్తి, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ రామానందన్ ల ఆధ్వర్యంలో గ్రామ పెద్దల సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నాలుగు నెలలకు గాను 5,68,870 రూపాయలు ఆదాయం వచ్చినట్టు వారు తెలిపారు.