Sunday, February 15, 2026

Creating liberating content

తాజా వార్తలువీరబాబు, సుబ్బారావుల‌ కుటుంబాల‌కు భువ‌నేశ్వ‌రి …రూ.3 ల‌క్ష‌లు ఆర్థిక సాయం అంద‌జేత

వీరబాబు, సుబ్బారావుల‌ కుటుంబాల‌కు భువ‌నేశ్వ‌రి …రూ.3 ల‌క్ష‌లు ఆర్థిక సాయం అంద‌జేత

టిడిపి అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాల్ని ఆమె పరామర్శిస్తున్నారు.దీనిలో భాగంగా నేడు జగ్గంపేట మండలం గుర్రంపాలెంలో టిడిపి కార్యకర్త పడాల వీరబాబు కుటుంబాన్ని భువనేశ్వరి ఓదార్చారు. కుటుంబసభ్యుల యోగక్షేమాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్థికసాయం కింద రూ.3లక్షల చెక్కును అందజేశారు. అనంత‌రం ఆమె పెద్దాపురం నియోజ‌క‌వ‌ర్గంలోని కండ్ర‌కోట గ్రామానికి వెళ్లారు..టిడిపి కార్య‌క‌ర్త బుద్దాల సుబ్బారావు చిత్ర పటానికి పూల మాల వేసి నివాళుల‌ర్పించారు.. అనంత‌రం టిడిపి త‌రుపున సుబ్బారావు కుటుంబానికి ఆర్థిక సాయం అంద‌జేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article