కదిరి:ఇచ్చిన మాటకు కట్టుబడి కరోనా లాంటి కష్ట కాలంలో కూడా ఇబ్బందులెన్ని ఎదురైనా రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చిన విశ్వసనీయత కలిగిన సీఎం జగనన్నకు, అధికారం కోసం అడ్డదారులు తొక్కడంతో పాటు వెన్నుపోటుకు సైతం వెనకాడని చంద్రబాబుకు మధ్య వ్యత్యాసం గమనించి ఓటర్ల నిర్ణయం తీసుకొని ఓట్లు వేయాలని కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్ మక్బూల్ సూచించారు. మంగళవారం కదిరి పట్టణంలోని పలు వార్డులలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటర్లతో ముచ్చటిస్తూ.. “సీఎం జగనన్న మానస పుత్రకైనటువంటి వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పే దమ్ము మాకుంది. జన్మభూమి కమిటీలను మళ్లీ తీసుకొస్తామని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందేమో అడిగి చూడండి. నా పాలన చూసి నాకు ఓటేయండి అని అడిగే దమ్ము మా సీఎం జగనన్నకు ఉంది. నా 14 ఏళ్ల పాలన చూసి మా పార్టీకి ఓటేయండి అని అడిగే ధైర్యం నీకుందా చంద్రబాబు. విద్యా వ్యవస్థను మెరుగుపరిచి సరైన విద్యను అందించడమే భవిష్యత్ తరాలకు మనమిచ్చే ఆస్తి అని చెప్పే జగనన్నకు, రాష్ట్ర ప్రజలకు మంచి మధ్యాన్ని సప్లై చేస్తానని చెప్పే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల మధ్య వ్యత్యాసం గమనించండి. రెండవసారి అధికారం చేపడితే పేదలకు రెండింతలు మేలు చేస్తానని జగనన్న చెబుతుంటే, మేం గెలిస్తే ప్రత్యర్థుల అంతు చూస్తాం, పాతాళానికి తొక్కేస్తామని చెప్పే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు కేవలం పగ తీర్చుకోవడానికి మమ్మల్ని గెలిపించండని అడుగుతున్నారు” అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అజ్జుకుంట రాజశేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు ఇస్మాయిల్, ఖాసీం, గౌతమిఓం ప్రకాష్, పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

