ఆంధ్రప్రదేశ్ ఆదివాసి గిరిజన సంఘం
బుట్టాయగూడెం :వివాదాలు నడుస్తున్న ఎల్ టి ఆర్ 1/ 70 భూముల్లో రియల్ ఎస్టేట్ కు చెందిన పనులను చేపట్టిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదివాసి గిరిజన సంఘం అధ్యక్షుడు తెల్లం రామకృష్ణ డిమాండ్ చేశారు. స్థానిక పత్రికలకు సోమవారం రామకృష్ణ విడుదల చేసిన ప్రకటనలో జంగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి, తన అనుచరుడుతో కలిసి ఎల్ టి ఆర్ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటానికి జెసిపితో పనులు చేయిస్తున్నట్లు తెలిపారు. దీనిని స్థానిక గిరిజనులు అడ్డుకొని, బుట్టాయగూడెం మండల తహసిల్దార్ కు, బుట్టాయగూడెం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. దీన్ని ఉద్దేశించి ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలోని చట్టాలకు విరుద్ధంగా కొంతమంది దళారీలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారని, గతంలో సదరు విషయమే ఐటీడీఏ పీవో, జిల్లా కలెక్టర్ లకు విన్నవించడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నిలుపుదల చేయడం జరిగిందని, మరల ఇప్పుడు జంగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి, తన అనుచరుడు జెసిబి ని తీసుకొచ్చి పనులు చేయించడానికి తీవ్రంగా ఖండించారు. తక్షణమే వివాదాల భూముల్లో సమస్యను పరిష్కారం చేయడానికి యిరుపక్షాల ఆధ్వర్యంలో రికార్డు వెరిఫికేషన్ చేయాలని అధికారులు కోరినట్లు తెలిపారు.