వేంపల్లె
ప్రతి విద్యార్థి పైస్థాయికి ఎదగాలన్నదే ఉపాధ్యాయుల ఆకాంక్షనని ఉపాధ్యాయులు బాలకొండయ్య, మధుసూదన్ రెడ్డి, జరీనా, గౌస్ పేర్కొన్నారు. ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీచైతన్య ఉన్నత పాఠశాల 2000-01 పదవ తరగతి బ్యాచ్ విధ్యార్థులు ఉపాధ్యాయులకు శాలువ, పూలమాలతో ఘనంగా సత్కరించారు. అలాగే నమస్కార వందనంతో గౌరవించారు. అనంతరం వారు మాట్లాడుతూ విధ్యార్థి జీవితంలో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం చాలా అవసరమని తెలిపారు. దీంతో భవిష్యత్తులో ముందుకు వెళ్లేందుకు దోహద పడుతాయన్నారు. అలాగే సేవాభావం కలిగి సమాజ సేవలో భాగస్వామ్యం కావాలని కోరారు. అనంతరం పూర్వ విద్యార్థులకు వారు కండువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు బి.శ్రీనాధ్ రెడ్డి, శివకేశవరెడ్డి, అమర్నాథరెడ్డి, ఖాదర్, దిలిప్ కుమార్ రెడ్డి, రామాంజనేయరెడ్డి, ప్రవీణ్ కుమార్, నాగమల్లారెడ్డి, చంద్రఓబుల్ రెడ్డి, మహేశ్వర రెడ్డి, డక్కా రమేష్, ఇమామ్ హుస్సేన్, శివప్రసాద్, నాగిరెడ్డి, రవిశంకర్ రెడ్డి, ఉత్తమారెడ్డి, బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు.