వేలేరుపాడు
విద్యుత్ ప్రమాదం తో పూరిల్లు దగ్ధమైన సంఘటన శుక్రవారం వేలేరుపాడు మండలం మద్దిగట్ల గ్రామంలో జరిగింది, వివరాల్లోకి వెళితే వేలేరుపాడు మండలం మద్దిగట్ట గ్రామానికి చెందిన బీరబోయిన రమణమ్మ అనే మహిళ ఇల్లు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఈ ప్రమాదం సంభవించడం తో, చుట్టుపక్కల వారు హుటాహుటిన చెలరేగుతున్న మంటలను అదుపు చేసారు.ఎక్కువగా ఆస్థి నష్టం జరగకుండా ఇంట్లో వున్న సామాగ్రిని మంటలు అంటుకున్న వెంటనే గ్రామస్థులు బయటకు తీసుకువచ్చారు. ఈలోగా ఫైర్ స్టేషన్ సిబ్బంది వచ్చి 50 వేల రూపాయల ఆస్థి నష్టం జరిగినట్టు ధ్రువీకరించారు,ఇల్లు మొత్తం కాలిపోయి, సర్వం కోల్పోయిన తనను ప్రభుత్వమే ఆదుకోవాలని రమణమ్మ వాపోయారు.