వేంపల్లె
స్థానిక పట్టణంలోని వైఎస్ఆర్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ ఆధ్వర్యంలో సమీప మదినాపురం కాలనీలో జరుగుతున్న ప్రత్యేక ఎన్ఎస్ఎస్ శిబిర కార్యక్రమాల్లో భాగంగా నాల్గవ మరియు ఐదవ రోజు అధికారిక విద్య లేదా సాధారణ ఉపాధిలో లేని యువత మీద యువత మీద సర్వే నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చెరసాల యోగాంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ ఈ సర్వే వలన కాలనీ ప్రజల విద్యా, ఆర్థిక, సామాజిక అంశాలను తెలుసుకోవడంలో ఉపయోగపడుతుందని తద్వారా కాలనీలోని ప్రజల జీవన విధానము ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 200 గృహాలను ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సర్వే నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

