వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య
ప్రజాభూమి, విజయవాడ బ్యూరో:
రాష్ట్రంలో విద్యార్థుల సాధికారిక జగనన్నతోనే సాధ్యం అవుతుందని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థుల సాధికారిక జగనన్నతోనే సాధ్యం అనే కార్యక్రమాన్ని వేలాదిమంది విద్యార్థులతో శుక్రవారం భారీ ర్యాలీ జరిగింది. ఏలూరు రోడ్డు బీఎస్ఎన్ఎల్ కార్యాలయం నుండి సీతారాంపురం సిగ్నల్ వరకు జరిగిన ర్యాలీలో విద్యార్థులు పాల్గొన్నారు. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా హామీల అమలు చేశారనే విషయమై వారు వివరించారు. అమ్మఒడి, ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన, విద్యా దీవెన ఇచ్చినటువంటి హామీలను 99% నెరవేర్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని తెలిపారు. సంక్షేమ అభివృద్ధి మీకు దక్కితేనే, మీ గుమ్మానికి మీ ఇంటికి సంక్షేమ అభివృద్ధి జరిగితేనే నాకు ఓటేయండి అని చెప్పినటువంటి దేశ చరిత్రలో ఎవరైనా ముఖ్యమంత్రి గారు ఉన్నారంటే అది జగనన్న మాత్రమే అని సందర్భంగా తెలియజేశారు, విద్యార్థుల సాధికారిత జగన్అన్నతోనే సాధ్యమని గత ప్రభుత్వం ఏ విధంగా విద్యార్థుల్ని మోసం చేసి అందలానికి ఎక్కి తర్వాత వాళ్ళ నడ్డి విరగ్గొట్టిందో చూశామన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థులకు నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తుందో గమనిస్తున్నారు. గ్రామ , సచివాలయ వ్యవస్థ ద్వారా దాదాపుగా నాలుగైదు లక్షల ఉద్యోగాల్ని కల్పించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందన్నారు. ధనార్జన ధ్యేయంగా విద్యను వ్యాపారంగా గత ప్రభుత్వం చేస్తే మధ్యతరగతి బిలో పావర్టీ లైన్ కి దిగువన వారికి విద్యార్థులకు చదువును అందించిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య విద్యార్థి నాయకులు సాయి , నాగసాయి , విటల్ , వినోద్ , కిరణ్ , నాగార్జున తదితరులు ప్రసంగించారు.