పోరుమామిళ్ల:
పట్టణంలో విద్యార్థులకు మంచి విద్యనే కాకుండా తక్కువ ఫీజులతో వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న తేజ కోచింగ్ సెంటర్ యాజమాన్యాన్ని ఆప్కాస్ స్టేట్ బోర్డ్ డైరెక్టర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అభినందించారు. తేజ కోచింగ్ సెంటర్ ఫేర్వెల్ డే సందర్భంగా ముఖ్య అతిధిగా హాజరైన ఆప్కాస్ స్టేట్ బోర్డ్ డైరెక్టర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తిని ఘనంగా సత్కరించారు, ఈ సందర్భంగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ పేద ప్రజలు ఇబ్బంది పడకుండా తక్కువ ఫీజులతో కోచింగ్ సెంటర్ ని నడుపుతూ మంచి విద్యను నేర్పిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సంవత్సరం కూడా నవోదయలో మరిన్ని ఎక్కువ శాతం సీట్స్ విద్యార్థులు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజేశ్వరి, వెటర్నరీ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, కోచింగ్ సెంటర్ అధినేత తేజ , అధ్యాపకులు పాల్గొన్నారు.