Wednesday, May 7, 2025

Creating liberating content

తాజా వార్తలువిద్యార్థులకు పద్యాలు, కథల పోటీలు

విద్యార్థులకు పద్యాలు, కథల పోటీలు

కలసపాడు
కాశినాయన మండలం రెడ్డి కొట్టాల ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు కథలు, పద్యాల పోటీలను రాష్ట్రపతి అవార్డు గ్రహీత దాదాపీర్, జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యవర్గ సభ్యులు ఖాసీం వల్లి లు నిర్వహించారు. అమెరికాలో నివాసముంటున్న హరిత ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఫణి రాజకుమార్ రెడ్డి కొట్టాల పాఠశాలలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఆదివారం విద్యార్థుల కోసం ఉయ్ లవ్ రీడింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జెవివి జిల్లా కార్యవర్గ సభ్యులు ఖాసీం వల్లి ఆదివారం విద్యార్థులకు వేమన, సుమతీ శతక పద్యాలు, కథల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ సందర్భంగా ఖాసీం వల్లి మాట్లాడుతూ విద్యార్థులలో పఠనం పట్ల ఆసక్తిని నింపేందుకే పోటీలు నిర్వహించామన్నారు. విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. ఈ పాఠశాలకు గ్రంథాలయం విరాళంగా అందజేసిన హరిత ఫౌండేషన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article