జీలుగుమిల్లి:విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి విచ్చేసిన పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండలం దర్భగూడెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు ముప్పిడి సురేష్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన టిడిపి జనసేన పార్టీల సంఘ నాయకులు కార్యకర్తలు అభిమానులు. ముప్పిడి సురేష్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇటివల 45 రోజులు విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి క్షేమంగా రావడంతో గురువారం నాడు టిడిపి జనసేన మరియు పలు సంఘాల నాయకులు కార్యకర్తలు అభిమానులు తమ నివాసానికి శనివారం నాడు వెళ్లి శుభాకాంక్షలు తెలిపి దుస్సాలువాళ్ళతో సన్మానించారు. గ్రామంలో పార్టీ కార్యకర్తల కుటుంబాలలో మరణించిన వ్యక్తుల కుటుంబాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించి ఓదార్చారు. పార్టీ అండగా ఉంటుందని రెడ్డి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన పార్టీల నాయకులు కర్రిపోతుల దావీదు (రాజ్ కుమార్) దూసరి వెంకటేశ్వరరావు, కలపాల శ్రీను, గుర్రం కాంతారావు, బుడుపుటి సాయిబాబు, రాయల ఏసు, నున్న శ్రీను, నేకూరి ఏసు, పిల్లెం వెంకటేశ్వరరావు, బత్తుల వెంకన్న, పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.