కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళం: విజయవాడ మరియు విశాఖపట్నం మధ్య ఉదయపు విమాన సర్వీసులను జూన్ 1వ తేదీ నుండి తిరిగి ప్రారంభించనున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడు గారు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నం నగరం నుండి రాజధాని విజయవాడ ప్రాంతం మధ్య విమాన సర్వీస్ తిరిగి ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ప్రస్తుత షెడ్యూల్ ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలిగించేలా రూపొందించబడిందని తెలిపారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ ATR విమానం విమానం విజయవాడ నుండి ఉదయం 7:15 గంటలకు బయలుదేరి, ఉదయం 8:25 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది అని. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం నుండి ఉదయం 8:45 గంటలకు బయలుదేరి, ఉదయం 9:50 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది అని తెలిపారు.ప్రాంతీయ విమాన కనెక్టివిటీని బలోపేతం చేయడం, అభివృద్ధి చెందుతున్న నగరాల మధ్య వేగవంతమైన రవాణా సౌకర్యాన్ని కల్పించడం తమ మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి, ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ కీలక సర్వీసును తిరిగి అందుబాటులోకి తీసుకురావడం ఎంతో సంతోషకరమైన విషయమని తెలిపారు.