పులివెందుల టౌన్
డ్రైవర్లు వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యం వహించవద్దని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ అన్నారు. సోమవారం ఎంవీఐ కార్యాలయం ఆవరణలో జాతీయ రహదారి భద్రత 35వ మాసోత్సవాలలో భాగంగా ఆయన డ్రైవర్లకు, ఆటో డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొందరపాటు, ఆరాటంతో అతివేగంగా వెళ్లడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తాయన్నారు, దాని ఫలితంగా కొందరు మృతి చెందడం, మరికొందరు శాశ్వత అంగవైకల్యానికి గురికావడంతో చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. కొందరు వ్యక్తులు సామాజిక బాధ్యతను విస్మరించి ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. కావున వాహనాలు నడిపేటప్పుడు తూచా తప్పకుండా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు కార్యక్రమంలో మోటార్ వెహికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు