సంక్షేమ పథకాల పంపిణీ లో వాలంటీర్ల పాత్ర కీలకం.
హిందూపురం అసెంబ్లీ , పార్లమెంట్ ఇంచార్జ్ లు దీపిక వేణు, శాంతమ్మ..
లేపాక్షి: ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన వాలంటీర్ వ్యవస్థ ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయమని హిందూపురం అసెంబ్లీ ఇంచార్జ్ దీపికా వేణు, పార్లమెంట్ అభ్యర్థి శాంతమ్మలు పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రమైన లేపాక్షి లోని వెలుగు కార్యాలయంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దీపికా వేణు శాంతమ్మలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ,ప్రజలకు ప్రభుత్వానికి వాలంటీర్లు వారదులని , వారి సేవలు మరువలేనివని హిందూపురం నియోజకవర్గ ఇన్చార్జి దీపికా వేణు, పార్లమెంట్ అభ్యర్థి శాంతమ్మలు పేర్కొన్నారు.
మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ ద్వారా నిరూపించారన్నారు.
మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకు అందించడంలో వాలంటీర్ల పాత్ర కీలకమని, వారు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు.
ఆనాడు కరోనా మహమ్మారి భయంతో దేశం భయాందోలనలకు గురవు తున్న సమయంలో జగన్ సూచనలతో వాలంటీర్లు దైర్యంగా ముందు వరుసలో నిలబడి బాధితులకు విశేష సేవలు అందించిందిన ఘనత వాలంటీర్ల వ్యవస్థ కే దక్కుతుందని పేర్కొన్నారు .ఇలాంటి వ్యవస్థను తొలగిస్తామని చంద్రబాబునాయుడు మాట్లాడడం ఎంత వరకు సమంజసమని దీపిక పేర్కొన్నారు. జగనన్న హయాంలో పేదలకు అన్ని రకాల సేవలు ప్రజల వద్దకే వస్తుంటే వాటిని చంద్రబాబు చూచి ఓర్వ లేకపోతున్నారని, అలాంటి వారికి రానున్న ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ది చెప్పాలని కోరారు. కరోనా సమయంలో వారియర్లుగా, ప్రభుత్వ పథకాలకు ప్రజలకు మధ్య వారధిలా గుర్తింపు పొందారన్నారు . అవార్డులను అందుకున్న వాలంటీర్లకు సన్మానించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం అమె వాలంటీర్లకు సేవా మిత్ర,సేవా వజ్ర,సేవా రత్న అవార్డులను అందించి ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ వాసుదేవ గుప్త,మండల వై కా పా కన్వీనర్ నారాయణస్వామి, జెడ్పిటిసి బాణాల శ్రీనివాస రెడ్డి, మండల ఉపాధ్యక్షులు అంజన రెడ్డి, లీలావతి, సర్పంచులు ఆదినారాయణ, అశ్వత్ధనారాయణ, నాయకులు చలపతి, ఆదినారాయణ, మండల అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు పాల్గొన్నారు.