ఏలేశ్వరం:-
ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు వరుపుల సుబ్బారావు వెంటే మేమంతా ఉన్నామని శంఖవరం మండలం అన్నవరం గ్రామానికి చెందిన యువ నాయుకులు వీరంకి ఉదయ్,కొండపల్లి సూర్య, వారణాసి హర్ష, పదిలం వరుణ్, గేదెల సురేష్,కొరుప్రోలు శివ అన్నారు. వీరు వరుపుల స్వగ్రామం లింగంపర్తి గ్రామంలో ఆయన ఇంటి వద్ద కలిసి మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే వరుపుల తోనే సాధ్యమన్నారు. నియోజకవర్గంలో తిరిగి వైసిపి జెండా ఎగరవేసేందుకు తామంతా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అన్నవరం ఎం పి టి సి దడాల సతీష్ ,కొండపల్లి అప్పారావు,వైస్ ప్రెసిడెంట్ బొబ్బిలి వెంకన్న బాబు,బలువు రాంబాబు,వజ్రకుటం సర్పంచ్ సకురు గుర్రజు, శంఖవరం మండల కన్వీనర్ నరాల శ్రీను తదితరులున్నారు.

