Saturday, September 13, 2025

Creating liberating content

తాజా వార్తలువన్నెపూడి హైవే పై దారి దోపిడి..!-వ్యాపారిని బెదిరించి రూ. 2 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు

వన్నెపూడి హైవే పై దారి దోపిడి..!-వ్యాపారిని బెదిరించి రూ. 2 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు

గొల్లప్రోలు

మినుములు వ్యాపారిని బెదిరించిన దుండగులు 2 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లిన సంఘటన బుధవారం రాత్రి గొల్లప్రోలు మండల పరిధి వన్నెపూడి హైవేపై జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు పరిశీలిస్తే… గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన నల్లాల వీరబాబు గడచిన కొంత కాలంగా మినుములు వ్యాపారం చేస్తున్నాడు. మినప గుళ్ళును టోకుగా కొనుగోలు చేసి తన సొంత మిల్లులో పప్పుగా ఆడి సామర్లకోట,జగ్గంపేట,ఎర్రవరం తదితర ప్రాంతాల్లో గల రిటైల్ వ్యాపారులకు విక్రయిస్తూ ఉంటాడు.వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా అమ్మిన సరుకుకు సంబంధించిన డబ్బులు రిటైల్ వ్యాపారుల వద్ద వసూలు చేసిన వీరబాబు తన మోటార్ సైకిల్ పై స్వగ్రామం వెళ్తుండగా వన్నెపూడి జంక్షన్ సమీపంలో వచ్చేసరికి ఇతడిని వెంబడిస్తూ మరో మోటార్ సైకిల్ పై వచ్చిన ఇరువురు దుండగులు వీరబాబు మోటర్ సైకిల్ ను వెనక నుండి ఢీకొట్టారు. దీంతో వీరబాబు అదుపు తప్పి క్రింద పడిపోగా ఇరువురు దుండగులు వీరబాబును రోడ్డు పక్కన హైవే పొలాల్లోకి లాక్కుని వెళ్లి చంపేస్తామని బెదిరించి అతని వద్ద ఉన్న సుమారు 2లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు. బాధితుడు వీరబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గొల్లప్రోలు ఎస్ ఐ బాలాజీ తెలిపారు. ఘటనా స్థలాన్ని పిఠాపురం సీఐ శ్రీనివాస్, గొల్లప్రోలు ఎస్ ఐ పరిశీలించారు. హైవేపై సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article