Friday, May 2, 2025

Creating liberating content

సినిమావచ్చే సంక్రాంతికి ప్రభాస్ 'రాజా సాబ్' !

వచ్చే సంక్రాంతికి ప్రభాస్ ‘రాజా సాబ్’ !

రాజాసాబ్ సినిమా రిలీజ్ గురించి తాజాగా హింట్ఇ చ్చారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్. రవితేజ హీరోగా నటించిన ఈగల్ చిత్రం వచ్చే శుక్రవారం (ఫిబ్రవరి 9) థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ తరుణంలో ఈ మూవీ కోసం నేడు మీడియాతో విశ్వప్రసాద్ మాట్లాడారు. ఈ సందర్భంగా రాజాసాబ్ రిలీజ్ గురించి ప్రశ్న ఎదురవగా.. ఆయన స్పందించారు.
రాజాసాబ్ చిత్రం వచ్చే ఏడాది (2025) సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం ఉందని విశ్వప్రసాద్ అన్నారు. తేదీని ఖరారు చేసుకున్నాక రిలీజ్ డేట్‍ను ప్రకటిస్తామని చెప్పేశారు. దీంతో 2025 సంక్రాంతి పండుగకు రాజాసాబ్ వస్తుందని దాదాపు ఖరారు చేసేశారు.
ఈ ఏడాది సంక్రాంతికి ఏకంగా నాలుగు సినిమాలు వచ్చాయి. తీవ్రమైన పోటీ నెలకొంది. ఇక వచ్చే ఏడాది 2025 సంక్రాంతికి కూడా హోరాహోరీగా తప్పేలా లేదు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించే సోషియో ఫ్యాంటసీ మూవీ కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతికి రానుంది. నాగార్జున కూడా ఓ మూవీని రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ప్రముఖ నిర్మాత దిల్‍రాజు కూడా తమ ప్రొడక్షన్ హౌస్ నుంచి 2025 సంక్రాంతికి ఓ మూవీ పోటీలో ఉంటుందని ఇటీవల చెప్పారు. ఇప్పుడు.. ఏకంగా ప్రభాస్ మూవీ రాజాసాబ్ సంక్రాంతికి తీసుకొస్తామని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చెప్పారు. ఇదే జరిగితే టాలీవుడ్‍లో 2025 సంక్రాంతి వార్ మరింత రసవత్తరంగా ఉండనుంది.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజాసాబ్ చిత్రానికి మారుతీ దర్శకత్వం వహిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా రాజాసాబ్ ఫస్ట్ లుక్ వచ్చింది. పంచెకట్టులో ప్రభాస్ లుక్ అదిరిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article