అమరావతి: బక్రీద్ సందర్భంగా మంగళగిరి ఈద్గాలో నిర్వహించిన ప్రార్థనల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముగ్గురు టిడిపి కార్యకర్తలను వైకాపా నేతలు హత్య చేసినా సంయమనం పాటిస్తున్నామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నడుచుకుంటున్నామని చెప్పారు. తమ కార్యకర్తలకు ఆగ్రహం వ్యక్తం చేస్తే వాళ్లు ఎక్కడ ఉంటారో తెలుసుకోవాలన్నారు. రుషికొండ ప్యాలెస్ వ్యవహారంలో ఇంకా బయటికి రావాల్సిన చిత్రాలు చాలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. రాబోయే వంద రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా గంజాయి విక్రయాలకు చెక్ పెడతామన్నారు. ప్రజాదర్బార్‌ను అన్ని నియోజకవర్గాల్లోనూ నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు.
