రామచంద్రపురం అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాలని కోరిన నాగేశ్వరరావు
రామచంద్రపురం
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను రామచంద్రపురం నియోజకవర్గం మైనార్టీ బీసీ సంఘం అధ్యక్షుడు యాట్ల నాగేశ్వరరావు మర్యాద పూర్వకంగా కలీసారు.ఈమేరకు ఆదివారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జరిగిన శంఖారావం సభకు ముందుగా ఆయనను మర్యాధ పూర్వకంగా కలిసినట్లు నాగేశ్వరరావు మీడియాకు తెలిపారు..అనంతరం యాట్ల లోకేష్ తో మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గం లో 95,వేలకు పైగా బీసీ ఓట్లు ఉన్నాయని. అందులో మైనార్టీ బీసీ సంఘం ఓటు బ్యాంకు 49,వేలు వరకు ఉందని,మా సంఘం ఏక గ్రీవ తీర్మానం ఆమోదంతో మీ ముందుకు వచ్చానని, నియోజకవర్గం లో మిగిలిన సామాజిక వర్గాలు మద్దతు కూడా నాకు ఉన్నదని పైగా నేను స్తానికుడినైనందున ప్రస్తుతం ఇక్కడ నియోజకవర్గంలో లోకల్ నినాదం వినిపిస్తుందని మాది రాజకీయ కుటుంబం, నేను గత 12 సంవత్సరాలు నుండి పలం సామాజిక సేవా కార్యక్రమాలు, ప్రజా సమస్యలు పై పోరాటాలు మా సంఘం యెక్క సహకారంతో ఎన్నో కార్యకమాలు చేశామని.కావున మా నియోజకవర్గం లో ఉన్న ప్రజలకు సేవ చేసేందుకు రామచంద్రపురం నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల లో టీడీపీ తరుపున పోటీ చేసే అవకాశం నాకు కల్పించాలని కోరానని తెలిపారు. అనంతరం నాయొక్క ప్రొఫైల్ చూసి లోకేష్ సానుకూలంగా స్పందించారని యాట్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎం.పి కింజారపు రామ్మోహన నాయుడు, ఇచ్చాపురం ఎమ్మెల్యే బిందాల అశోక్ తదితరులు ఉన్నట్లు చెప్పారు.