జనవరి 23న లోకేష్ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ శ్రేణులు, ఆయన అభిమానులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అమరావతి ప్రాంతానికి చెందిన తాడికొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుడు పులి చిన్న విజయవాడ కృష్ణానదిలో నారా లోకేష్ 100 అడుగుల భారీ కటౌట్ ను ఏర్పాటు చేయడమే కాకుండా కలర్స్ స్మోక్ బాంబులతో నీళ్లలో పేల్చి నాయకుడి పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడో అమరావతి రైతు. అటు విశాఖలో కూడా సముద్రం మీద లోకేష్ భారీ చిత్రపటాన్ని ప్రదర్శించాడు ప్రణవ్ గోపాల్ అనే మరో అభిమాని. ఇప్పుడు ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.