లేపాక్షి :- ప్రపంచ పర్యాటక క్షేత్రం గా పేరొందిన లేపాక్షి లో నంది ఉత్సవాల నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజాను లేపాక్షి వీరభద్రాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రమానందన్ కోరారు. తిరుపతిలో మంగళవారం ఉదయం ఆలయ కమిటీ చైర్మన్ రమానందన్ మంత్రి రోజాను కలిశారు. ఈ సందర్భంగా చైర్మన్ రామానందన్ లేపాక్షి ఆలయ అభివృద్ధిపై మంత్రి రోజాతో పలు విషయాలను చర్చించారు. లేపాక్షి ఆలయ అభివృద్ధికి సహకరించాలని మంత్రి ని కోరారు. అదేవిధంగా లేపాక్షిలో నంది ఉత్సవాల నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి రోజాను కోరారు. త్రేతా యుగం నాటి చారిత్రక ప్రాంతమైన జటాయువు ఘాట్ పనులు టీటీడీ ఆధ్వర్యంలో ఐదేళ్ల క్రితం ప్రారంభమయ్యాయని, అయితే ఆ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయని , ఆ పనుల పునరుద్ధరణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. విషయాలను సావధానంగా విన్న మంత్రి రోజా లేపాక్షి ఆలయ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. లేపాక్షి ఉత్సవాల నిర్వహణకు సంబంధిత అధికారులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. లేపాక్షి సమీపంలో అర్ధాంతరంగా ఆగిన జటాయువుఘాట్ నిర్మాణాలను పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి రోజా లేపాక్షి వీరభద్రాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కు హామీ ఇచ్చారు. దీంతో చైర్మన్ రామానందన్ మంత్రి రోజాకు కృతజ్ఞతలు తెలిపారు

