ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు
ప్రజాభూమి, విజయవాడ బ్యూరో
లింగ వివక్ష మహిళాభివృద్ధికి ఆటంకమని చట్టాలను అమలు చేయడం ఎంత ముఖ్యమో సమాజంలో మార్పు రావడం కూడా అంతే ముఖ్యమని స్త్రీలపట్ల జరుగుతున్న హింసను నియంత్రించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులై లింగ వివక్షను సమర్ధ వంతంగా ఎదుర్కోవాలని జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు పిలుపునిచ్చారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ మరియు జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో జెండర్ ఆధారిత హింసకు” వ్యతిరేకంగా శనివారం గొల్లపూడి సచివాలయం నుండి మహిళలతో నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రీ, పురుషుల మధ్య వివక్షత లేని వాడు నాగరికతతో కూడిన ఉత్తమ సమాజం ఏర్పడుతుందన్నారు. లింగ వివక్షత లేని సమాజం ఏర్పాటులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులైదామని ప్రతిన బూనాలన్నారు. లింగ వివక్షత సమాజం మహిళాభివృద్ధి ఆటంకం అవుతుందన్నారు. అన్ని రంగాలలోనూ పురుషులతో సమానంగా మహిళలు కూడా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తు న్నారని పేర్కొన్నారు. చట్టపరంగా, రాజ్యాంగబద్ధంగా అందరికీ సమాన హక్కులు ఉన్నాయని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న లైంగిక, శారీరక, మానసిక హింసకు వ్యతిరేకంగా బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరూ స్పందించాలన్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో లింగ వివక్షత అనేది ఉండదన్నారు. మహిళలపై హింసను, లింగ వివక్షతను నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చట్టాల ద్వారా నియంత్రిస్తోం దని తెలిపారు. కేవలం చట్టాల ద్వారా మాత్రమే కాకుండా సమాజంలో కూడా మార్పు వచ్చేలా నిరంతరం అవగాహన సదస్సులు నిర్వహిస్తోందని చెప్పారు. పాఠశాల నుంచి విశ్వవిద్యాలయాల స్థాయి వరకు సదస్సులు నిర్వహించి చైతన్యవంతులను చేయడం వలన కొంత వరకు సత్ఫలితాలు రావడం జరిగిందన్నారు. ఇప్పటికీ కొన్ని గ్రామీణ ప్రాంతాలలో బాల్య వివాహాలు జరుగుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని వీటిని నిరోధించేందుకు సమాఖ్య సభ్యులు నిరంతరం ఆయా గ్రామాలలోని మహిళల స్థితిగతులను పర్యవేక్షించాలన్నారు. ముఖ్యంగా బాలికలలో అక్షరాస్యత శాతం పెంచడం ద్వారా స్త్రీ పురుషుల మధ్య సమానత్వం సాధించడం సులభతరం అవుతుంద న్నారు. ప్రతి ఒక్కరికి జన్మనిచ్చే దేవతైన స్త్రీని పూజించబడి నపుప్పడే దేశం సుభిక్షంగా ఉంటుందని పురాణాలు సైతం నిర్వచించాయన్నారు. ఒక దేశ అభివృద్ధిని గణించాలంటే ఆ దేశంలో స్త్రీలకు ఉన్న హక్కులను గుర్తించి అందుకు అనుగుణంగా చట్టాలు అమలు అవుతున్నాయో లేదో పరిశీలిస్తే చాలని ఎంతోమంది తత్వవేత్తలు సైతం శతాబ్దాల క్రితమే చెప్పారన్నారు. ప్రాచీన కాలంలో స్త్రీ పురుషులిద్దరికి సమానమైన హక్కులు ఉండేవన్నారు. ఆనాటి రాచరిక వ్యవస్థలో సైతం మహిళలు యుద్ధాలలో పాల్గొనేవారని వివరించారు. మనం ఇప్పుడు చెప్పుకుంటున్న నాగరిక సమాజంలో పురుషులతో సమానంగా మహిళలు తమ హక్కులను వినియోగించు కునేందుకు ఆటంకాలు కల్పించే వారందరూ సమాజానికి చీడపురుగులన్నారు. మహిళల సాధికారత కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందన్నారు. లింగ వివక్షత నివారణ మహిళాభివృద్ధి కొరకు మహిళా శిశు సంక్షేమ శాఖ సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. రాజకీయ, క్రీడా, విద్యా రంగాలలో మన దేశ మహిళలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారన్నారు. ఒక మహిళ గర్భం ధరించగానే పుట్టబోయే శిశువు ఆడ, మగ అని తెలుసుకునే వైద్య విజ్ఞానం అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలలో కూడా మహిళలు ఉ న్నారన్నారు. లింగ వివక్షత నిర్మూలన కోసం సమాజంలో అందరం కలిసి పని చేయాలన్నారు. అప్పుడే అనాగరిక లక్షణాన్ని సమాజం నుంచి పారద్రోలగలమన్నారు. తొలుత కూతురు కొడుకు అనే తారతమ్యం లేకుండా విద్య, అభివృద్ధిలో సమాన అవకాశలు కల్పిస్తామని, బాల్య మరియు బలవంతపు వివహాలు, గృహ హింసను వ్యతిరేకిస్తామని, సమస్యలను పరిష్కరించు కునేందుకు ఎంతటి వారినైనా వదిలిపెట్టమని చట్టాలను వినియోగించుకునేలా శాంతి సంఘీభావ సందేశాలను వ్యాప్తి చేస్తామని మహిళాల చేత అనంతరం స్త్రీలకు తగిన గౌరవం ఇస్తామని వారి హక్కుల కోసం నిలబడతామని మహిళలపై హింస సామాజిక భాధ్యత స్వీకరిస్తామని మహిళాలు హక్కులను వియోగించుకునేలా కృషి చేసి సురక్షితమైన వాతావరణం కల్పిస్తామని హింసకు వ్యతిరేకంగా చేపట్టే కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతామని పురుషుల చేత ప్రతిజ్ఞ చేయించారు.
సమావేశంలో డీఆర్డీఏ పీడీ కె. శ్రీనివాసరావు, డ్వామా పీడీ జె. సునీత, ఐసిడిఎస్ పిడి జి. ఉమాదేవి, జిల్లా వ్యవసాయ అధికారిణి యస్ నాగమణెమ్మ, రూరల్ మండల యంపిడివో జాహ్నవి, జిల్లా సమైఖ్య అధ్యక్షురాలు కె. సీత, కార్యదర్శి కె. రాణి, ఐసిడిఎస్ సిడిపివోలు జి. మంగమ్మ. కె. నాగమణి, జిల్లా సమైఖ్యసభ్యులు, స్వయం సహాయక బృందాల మహిళలు, పాల్గొన్నారు.