రజనీకాంత్ అతిథి పాత్రలో నటించిన లాల్ సలామ్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తొలి రోజే చాలా చోట్ల మార్నింగ్ షోలు రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్ట్ చేసిన లాల్ సలామ్ సినిమాను తమిళంలో పెద్ద ఎత్తున రిలీజ్ చేశారు. కానీ తెలుగులో మాత్రం మేకర్స్ ఎలాంటి ప్రమోషన్లు నిర్వహించలేదు. హైదరాబాద్ తోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల టికెట్లు కొనేవాళ్లు లేక మార్నింగ్ షోలు రద్దు చేశారు. హైదరాబాద్ లో ఏఎంబీ, ఏఏఏ, జీపీఆర్ లాంటి మల్టీప్లెక్స్ లకు వెళ్లి లాల్ సలామ్ చూద్దామనుకున్న కొందరు అభిమానులకు నిరాశే ఎదురైంది.ఆన్‌లైన్ లో ఇప్పటికే కొంత మంది బుక్ చేసుకోగా.. వాటిని కూడా క్యాన్సిల్ చేసి వాళ్లకు డబ్బులు రీఫండ్ చేశారు. ఫస్ట్ డే ఫస్ట్ షోలకే ఇలాంటి పరిస్థితి ఉండటంతో మిగిలిన షోల సంగతేంటన్నది అర్థం కావడం లేదు. తెలుగులో యాత్ర 2, ఈగల్ సినిమాలు ఈ లాల్ సలామ్ కు పోటీగా రిలీజయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా లాల్ సలామ్ ను దెబ్బకొట్టాయని చెప్పొచ్చు.