ప్రముఖ వైద్యులు వెంకటరమణ విద్యార్థులుకు హితవు.
ప్రజాభూమి, రామచంద్రపురం
ప్రతీ విద్యార్థి ఒక లక్ష్యం తో నిత్యం సాధనచేస్తే సాదించలేనిదంటూ ఏమి ఉండదని మీ భవిష్యత్తు మీచేతుల్లోనే ఉందని దానిని మీకు తగ్గట్లుగా మలుచుకున్న రోజున భవిష్యత్ ఉన్నతమైన స్థాయిలో ఉండగలరని ప్రముఖ వైద్యులు కాదా వెంకట రమణ విద్యార్థులుకు చూచించారు.ఈమేరకు
కాకినాడకు చెందిన సత్య స్కాన్ , డయాగ్నోస్టిక్స్ సెంటర్ ఛీఫ్ రేడియాలజిస్ట్ డాక్టర్ కాదా వెంకటరమణ,ద్రాక్షారామం లో గల శ్రీవెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ (హెన్) ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో “మేక్ లైఫ్ మీనింగ్ ఫుల్” కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ శీలం రాకో రాజు ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటరమణ హజరైయ్యారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితాన్ని అర్ధవంతంగా తీర్చిదిద్దుకోవడం విద్యార్థుల చేతుల్లోనే ఉందని ప్రతీ విద్యార్థి ఒక లక్ష్య సాదనతో ముందుకెళ్ళాలని చూచించారు జీవితానికి దశ, దిశ నిర్ధేశించేది విద్య ఒక్కటే మార్గ మని అలాంటి విద్య పట్ల నిర్లక్ష్యం వహించరాదని విద్యార్థినీ విద్యార్థులుకు ఈసందర్భంగా వెంకటరమణచూచించారు. జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదురౌతాయని వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్ననాడే మనం జీవితంలో విజయం సాధించగలమని విద్యార్థుల్లో భరోసా కల్పించారు . అనంతరం వ్యక్తిత్వ వికాస నిపుణుడు అల్లూరి సురేంద్ర మాట్లాడుతూ మానసిక వికాసానికి చదువుతోపాటు మంచి మానవ సంబంధాలు తోడ్పాటు అందిస్తాయని చెప్పారు. అలాగే విద్య తో పాటు క్రీడలు ఎంతో అవసరం మని తద్వారా విద్యార్థులు మానసిక ఉల్లాసంగా నిత్యం ఉండగరని అన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ గంగుమళ్ళ జ్యోతి, హెన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.వి.ఆర్.ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు.