కడప
కడప నగరం, 48 డివిజన్, కృపా కాలనీలో నడవడానికి త్రోవలు లేక సమస్యలతో నిరుపేదలు కాలం గడుపుతున్న తరుణంలో న్యూ నేటివ్ కృపా మినిస్ట్రీస్ అధ్యక్షులు పాస్టర్ పి.మహేష్, సిస్టర్ శాంతమ్మలు కాలనీ ప్రజలతో కలిసి ఇటీవల కార్పొరేషన్ నందు స్పందన కార్యక్రమంలో కమిషనర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్ కు తమ సమస్యలను వినిపించుకున్నారు. తక్షణమే స్పందించిన అధికారులు డిఈ హుస్సేన్, ఏఈ నాగార్జున, సచివాలయం సిబ్బంది ప్రకాశ్, రోశయ్యలు కృపా కాలనీని సర్వే చేసి ఇక్కడ రోడ్డును నిర్మించేందుకు పైఅధికారుల ఆదేశాల ద్వారా రోడ్డు నిర్మాణ పనులను కాంట్రాక్టర్ ఓబుల్ రెడ్డి కి అప్పజెప్పగా తక్షణమే శుక్రవారం కృపా కాలనీలో రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ పి.మహేష్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలుగా న్యూ నేటివ్ కృపా చర్చికి వచ్చే భక్తులు , ఈ కాలనీ ప్రజలు నడవడానికి మార్గాలు లేక మురుగు నీటిలో నడుస్తూ ప్రజలు అవస్థలు పడుతున్న సందర్భంలో ఇప్పుడు స్పందన కార్యక్రమం ద్వారా మాకు రోడ్డు, త్రాగు నీటి సమస్య తీర్చినందుకు ఎంతో సంతోషకరంగా ఉందని, అధికారులను యేసు క్రీస్తు చల్లగా చూడాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ ఓబుల్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు డి.శ్రీరాములు, వాలంటీర్ పి.రవితేజ, వెంకటరమణ, లక్ష్మి, అగస్టిన్, శాంతిరాజు, కృపా కాలనీ వాసులు అధికారులకు, కమిషనర్ కు వందనములు తెలిపారు.