Tuesday, February 17, 2026

Creating liberating content

తాజా వార్తలురోడ్డు ప్రమాదంలో మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే తెల్లం బాలరాజు

రోడ్డు ప్రమాదంలో మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే తెల్లం బాలరాజు

బుట్టాయగూడెం. మండలంలోని రెడ్డిగూడెం గ్రామస్తుడు గోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఈనెల 7వ తేదీన రోడ్ ప్రమాదం లో మరణించాడు. మృతుని కుటుంబానికి బుధవారం పోలవరం శాసన సభ్యుడు తెల్లం బాలరాజు, పోలవరం నియోజకవర్గం ఇంచార్జ్ తెల్లం రాజ్యలక్ష్మి రూ.5000/- రూపాయలు ఆర్ధిక సహాయం అందించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ మృతుని కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం నుండి వచ్చే బీమా తొందరగా వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మొడియం రామతులసి, మండల కన్వీనర్ అల్లూరి రత్నాజీ,మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఆరేటి శాంతి కుమారి సత్యనారాయణ, స్థానిక సర్పంచ్ కుంజా దుర్గమ్మ, సర్పంచ్ ఛాంబర్ అధ్యక్షులు బన్నే బుచ్చిరాజు, సర్పంచులు, ఎంపీటీసీలు,స్థానిక వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article